Share News

Elon Musk: ఒక్క `సారీ`.. రూ.1600 కోట్లు లాభం.. ఎలన్ మస్క్ జాక్‌పాట్

ABN , Publish Date - Jun 12 , 2025 | 03:53 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుభేరుడు ఎలన్ మస్క్ మధ్య కొన్ని రోజుల క్రితం విభేదాలు మొదలైన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు ట్రంప్‌పై మస్క్ మాటల యుద్ధానికి దిగారు. అయితే తాజాగా మస్క్ వెనక్కి తగ్గారు. ట్రంప్‌నకు సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు.

Elon Musk: ఒక్క `సారీ`.. రూ.1600 కోట్లు లాభం.. ఎలన్ మస్క్ జాక్‌పాట్
Elon Musk

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రపంచ కుభేరుడు ఎలన్ మస్క్ (Elon Musk) మధ్య కొన్ని రోజుల క్రితం విభేదాలు మొదలైన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు ట్రంప్‌పై మస్క్ మాటల యుద్ధానికి దిగారు. సంచలన ఆరోపణలు చేశారు. అయితే తాజాగా మస్క్ వెనక్కి తగ్గారు. ట్రంప్‌నకు సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్టు పేర్కొన్నారు. మస్క్ క్షమాపణలను ట్రంప్ అంగీకరించారు. దీంతో ఎలన్ మస్క్ భారీ లాభాలను ఆర్జించారు (Elon Musk apologies Donald Trump).


అమెరికా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయి ఉన్న టెస్లా షేర్లు బుధవారం భారీగా లాభపడ్డాయి. సారీ పోస్ట్‌తో మస్క్ నికర సంపద బుధవారం ఒక్కరోజే దాదాపు 191 మిలియన్ డాలర్ల మేర పెరిగింది. అంటే మన దేశీ కరెన్సీలో దాదాపు 1600 కోట్ల రూపాయలు. బుధవారం తెల్లవారు ఝామున మస్క్ తన ఎక్స్ ఖాతా ద్వారా ట్రంప్‌నకు క్షమాపణలు తెలిపారు. `అమెరికా అధ్యక్షుడిపై పెట్టిన నా పోస్ట్‌లపై విచారం వ్యక్తం చేస్తున్నా. అవి చాలా దూరం వెళ్లాయి`. అవి చాలా దూరం వెళ్లాయి అని మస్క్ పేర్కొన్నారు. మస్క్ క్షమాపణలను ట్రంప్ ఆమోదించినట్టు వైట్‌హౌస్ కూడా ఓ ప్రకటన జారీ చేసింది.


అమెరికా ప్రభుత్వం రూపొందించిన `బిగ్ బ్యూటిఫుల్ బిల్లు`ను టెస్లా అధినేత మస్క్ వ్యతిరేకించిన దగ్గర్నుంచి వారి మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత ట్రంప్‌పై మస్క్ వరుసగా సంచలన ఆరోపణలు చేశారు. ట్రంప్‌తో విభేదాల నేపథ్యంలో మస్క్ సంస్థ టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. ఒక్క రోజులోనే ఏకంగా 14 శాతం మేర నష్టపోయాయి. ఆ తర్వాత కాస్తా కోలుకున్నాయి. తాజాగా ట్రంప్-మస్క్ మధ్య విభేదాలు తొలిగిపోవడంతో లాభాలను ఆర్జిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి

రాజీవ్‌ యువ వికాసం మరింత జాప్యం

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల కల సాకారమయ్యేనా

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 12 , 2025 | 03:57 PM