Starlink price in India: భారత్‌లో ప్రారంభం కానున్న స్టార్ లింక్ సేవలు.. నెలవారీ ధర ఎంతో తెలిస్తే..
ABN , Publish Date - Jun 09 , 2025 | 09:25 PM
ప్రపంచ కుభేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ మన దేశంలో సేవలను త్వరలోనే ప్రారంభించబోతోంది. స్టార్‌లింక్ సంస్థ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. ఇప్పటికే వందకు పైగా దేశాల్లో స్టార్‌లింక్ తన సేవలను అందిస్తోంది.

ప్రపంచ కుభేరుడు ఎలన్ మస్క్ (Elon Musk)కు చెందిన స్టార్‌లింక్ సంస్థ మన దేశంలో సేవలను త్వరలోనే ప్రారంభించబోతోంది. స్టార్‌లింక్ (Starlink) సంస్థ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. ఇప్పటికే వందకు పైగా దేశాల్లో స్టార్‌లింక్ తన సేవలను అందిస్తోంది. మనదేశంలో కూడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ నుంచి స్టార్‌లింక్ తాజాగా అనుమతులు పొందింది (Starlink Monthly Plan Charges).
భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన వన్‌వెబ్, రిలయెన్స్ జియో సంస్థల తర్వాత మన దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ అనుమతి పొందిన మూడో సంస్థ స్టార్‌లింక్. టెలికాం సిగ్నళ్లు అందని మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాలకు స్టార్ లింక్ ద్వారా సులభంగా ఇంటర్నెట్ సౌకర్యం అందుతుంది. అయితే స్టార్ లింక్ ధర మాత్రం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇటీవల బంగ్లాదేశ్‌లో కూడా స్టార్‌లింక్ సేవలు ప్రారంభమయ్యాయి. అక్కడ స్టార్‌లింక్ కనెక్షన్ తీసుకోవాలనుకునే వారు డేటా రిసీవర్ హార్డ్‌వేర్ కోసం ముందుగా రూ.33 వేలు చెల్లించాలి.
కనెక్షన్ తీసుకున్న తర్వాత నెలవారీ ప్లాన్ ధరలు రూ.3000 నుంచి ప్రారంభమవుతాయి. మనదేశంలో కూడా స్టార్‌లింక్ అవే ధరలను నిర్ణయించవచ్చని సమాచారం. ప్రస్తుతం మన దేశంలో పలు టెలికాం కంపెనీలు 100 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను రూ.1000 లోపే అందిస్తున్నాయి. వీటికి ఓటీటీ, టీవీ ప్రయోజనాలు అదనం. వీటితో పోల్చుకుంటే స్టార్‌లింక్ ధరలు దాదాపు మూడు రెట్లు అధికం. సాధారణ నగరాలు, పట్టణాల్లో కాకుండా మారమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో స్టార్‌లింక్ సేవలు ఎక్కువగా ఉపయోగపడతాయి.
ఇవీ చదవండి:
రెస్టారెంట్‌లో లేట్ సర్వీస్..హోటల్ ధ్వంసం చేసిన కస్టమర్లు
ప్రధానిని పలకరించిన యూనస్..బంగ్లాదేశ్ నుంచి మోదీకి సందేశం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..