Share News

Credit Rating: మన దేశంలో క్రెడిట్ స్కోర్ లేదా క్రెడిట్ రేటింగ్ ఇచ్చేది ఎవరు? వారు ఫాలో అయ్యే రూల్స్ ఏంటి..

ABN , Publish Date - Jan 02 , 2025 | 03:06 PM

క్రెడిట్ స్కోరు బాగుంటేనే బ్యాంకులు మిమ్మల్ని నమ్ముతాయి. ఈ క్రెడిట్ స్కోర్ లేదా క్రెడిట్ రేటింగ్‌లను సాధారణంగా క్రెడిట్ రిఫరెన్స్ ఏజెన్సీలు లేదా క్రెడిట్ బ్యూరోలు ఇస్తాయి. క్రెడిట్ స్కోర్‌లను లెక్కించేందుకు ఒక్కో బ్యూరో ఒక్కో పద్ధతిని కలిగి ఉంటుంది.

Credit Rating: మన దేశంలో క్రెడిట్ స్కోర్ లేదా క్రెడిట్ రేటింగ్ ఇచ్చేది ఎవరు? వారు ఫాలో అయ్యే రూల్స్ ఏంటి..
Credit Score

మనకు బ్యాంకుల (Banks) నుంచి ఏదైనా లోన్ (Bank Loan) రావాలన్నా, ఇంకేదైనా ఇతర సహాయం అందాలన్నా ముందుగా చెక్ చేసేది మన క్రెడిట్ స్కోర్ (Credit Score). క్రెడిట్ స్కోరు బాగుంటేనే బ్యాంకులు మిమ్మల్ని నమ్ముతాయి. ఈ క్రెడిట్ స్కోర్ లేదా క్రెడిట్ రేటింగ్‌ (Credit Rating)లను సాధారణంగా క్రెడిట్ రిఫరెన్స్ ఏజెన్సీలు లేదా క్రెడిట్ బ్యూరోలు ఇస్తాయి. క్రెడిట్ స్కోర్‌లను లెక్కించేందుకు ఒక్కో బ్యూరో ఒక్కో పద్ధతిని కలిగి ఉంటుంది. భారతదేశంలో ప్రధానంగా నాలుగు క్రెడిట్ బ్యూరోలు ఉన్నాయి. క్రెడిట్ స్కోర్‌లను లెక్కించేటప్పుడు అన్ని క్రెడిట్ బ్యూరోలు మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి.


భారతదేశంలో ప్రధానంగా, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ (CIBIL), ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్, సీఆర్‌ఐఎఫ్ హై మార్క్ అనే నాలుగు బ్యూరోలు క్రెడిట్ స్కోర్‌ను నిర్ధారిస్తాయి. క్రెడిట్ స్కోర్‌లను లెక్కించేందుకు ఒక్కో బ్యూరో ఒక్కో పద్ధతిని ఫాలో అవుతుంది. క్రెడిట్ స్కోర్‌ లెక్కింపునకు థంబ్ రూల్ అంటూ ఏదీ లేదు. కానీ, అందరూ తెలుసుకోవాల్సిన సాధారణ మంత్రం.. మీ క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే మీరు ఆర్థికంగా నమ్మదగిన వారు. మీ క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటే మీకు అప్పు ఇవ్వడం రిస్కీ. బ్యాంకులతో మీ గత లావాదేవీల ఆధారంగానే క్రెడిట్ స్కోర్‌ను నిర్ణయిస్తారు. మీరు ఎటువంటి రుణ గ్రహీత అనే విషయం క్రెడిట్ స్కోర్ ఆధారంగా తెలుసుకోవచ్చు.


మీ క్రెడిట్ స్కోర్ 750కు పైన ఉంటే మీకు లోన్‌లు సులభంగా వచ్చేస్తాయి. ఒకవేళ 500, అంతకన్నా తక్కువ ఉంటే మీకు లోన్ రావడం కష్టమవుతుంది. మీరు గతంలో తీసుకున్న లోన్లు, చెల్లించిన తీరు, క్రెడిట్ కార్డు వాడే విధానం, మీ అకౌంట్ బ్యాలెన్స్ మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే మీ ఆదాయం, ఉద్యోగ పరిస్థితి, చిరునామా, రీ పేమెంట్ హిస్టరీ, ఇప్పటికే ఉన్న వ్యక్తిగత రుణాలు మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుని మీ క్రెడిట్ స్కోర్‌ను నిర్ధారిస్తారు. అయితే మీకు రుణం ఇచ్చే బ్యాంక్ మీ క్రెడిట్ యోగ్యతను అంచనా వేయడానికి వారు ఏ క్రెడిట్ రిఫరెన్స్ ఏజెన్సీని ఉపయోగించాలనుకుంటున్నారో మీకు తెలియజేయాల్సిన అవసరం లేదు.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 02 , 2025 | 03:06 PM