Credit limit increases: క్రెడిట్ కార్డు యూజర్లకు గమనిక.. లిమిట్ పెంచుకోవట్లేదా?
ABN , Publish Date - Nov 08 , 2025 | 07:49 AM
ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. క్రెడిట్ కార్డు లేని యూజర్ లేడు అంటే అతిశయోక్తి కాదు. క్రెడిట్ కార్డు ఎంత శాతం వాడాలి, క్రెడిట్ లిమిట్ పెంచుకుంటే లాభమా? నష్టమా? అనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: తమ బ్యాంకు అకౌంట్‌లో జీతం పడే ఉద్యోగులకు.. ఆర్థికంగా కాస్త తోడు ఉండేందుకు, వారికి సహాయంగా ఉంటూనే ఆదాయాన్ని పొందేందుకు బ్యాంకులు క్రెడిట్ కార్డును అందజేస్తుంది. క్రెడిట్ కార్డుతో ముందుగానే కొంత డబ్బును ఇచ్చి, ఆ డబ్బును వాడుకోవడానికి వీలు కల్పిస్తాయి. దీంతో ఉద్యోగి, క్రెడిట్ కార్డుతో తమ ఆర్థిక అవసరాలను తీర్చుకుంటాడు. తనకు వచ్చిన కార్డు లిమిట్‌లో డబ్బును ఆర్థిక అవసరాలకు ఉపయోగిస్తూ నెల రోజుల సమయంలో ఈఎమ్ఐ ఆప్షన్ తో డబ్బును చెల్లించే అవకాశం ఉంటుంది. దీంతో యూజర్, తమకు నచ్చినంత డబ్బును అవసరానికి ఉపయోగించుకుంటాడు.
అయితే క్రెడిట్ కార్డుతో లాభంతోపాటు నష్టాలు కూడా చాలానే ఉన్నాయి. తీసుకున్న డబ్బును సమాయానికి చెల్లించకపోతే భారీగా వడ్డీతో పాటు బ్యాంక్ మనీ రికవరీ ఏజెంటులు ఒత్తిడి చేస్తారు. సమయానికి డబ్బులు చెల్లిస్తే.. మంచి క్రెడిట్ స్కోరు ఉంటుంది. దీంతో తదుపరి ఏదైనా లోన్ తీసుకోవాలనుకుంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే సరైన సమయానికి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేవారి డబ్బుల పరిమితి (Credit limit)ని బ్యాంకులు పెంచుతూ ఉంటాయి. బాధ్యతాయుతంగా ఉన్న కార్డు యూజర్‌కు బ్యాంక్ ఆఫర్ చేసే లిమిట్ పెంచుకోవాలా? తిరస్కరించాలా? అనేది కార్డుదారుని నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
క్రెడిట్ స్కోర్ వాడేవారి పర్పార్మెన్స్ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR) ద్వారా వెల్లడవుతుంది. యూజర్ కు ఇచ్చిన కార్డు లిమిట్ లో ఎంత శాతం క్రెడిట్‌ను వాడుకున్నామో దాన్నే సీయూఆర్ అంటారు. ఇది 30 శాతం ఉండేలా చూసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ఉదాహరణకు మీ కార్డు లిమిట్ రూ.లక్ష ఉన్నట్లయితే నెలకు రూ.30 వేలు లావాదేవీలు చేస్తే యుటిలైజేషన్ రేషియో 30 శాతం ఉంటుంది. ఒకవేళ మీ బ్యాంకు ఆ లిమిట్‌ను రూ.2 లక్షలకు పెంచితే.. మీరు అదే రూ.30 వేలు వాడినట్లయితే సీయూఆర్ 15 శాతం అవుతుంది. అంటే 15 శాతం తగ్గుతుంది. ఇలా తక్కువగా వాడటం వలన మంచి క్రెడిట్ స్కోరు ఉంటుంది. సకాలంలో బిల్లులు చెల్లించడం, బకాయిలు పెండింగ్ లో లేనప్పుడు క్రెడిట్ లిమిట్ ని పెంచుకోవచ్చు. ఒకవేళ బకాయిలు మినిమమ్ అమౌంట్ మాత్రమే కడుతూ ఉంటే లిమిట్ ఇంక్రీజ్ జోలికి వెళ్లకుండా వెళ్లడమే ఉత్తమం.
ఇవి కూడా చదవండి:
Vegetable Vendor Wins Lottery: ఆంజనేయస్వామి దయ.. కూరగాయల వ్యాపారికి రూ.11 కోట్ల లాటరీ
Supreme Court Orders Removal of Stray Dogs: జనసమ్మర్థ ప్రాంతాల్లో వీధి కుక్కలు కనపడొద్దు!