Share News

Youtube India: ఇట్స్ అమేజింగ్.. యూట్యూబ్ నుంచి వేల కోట్లు సంపాదిస్తున్న ఇండియన్స్..

ABN , Publish Date - May 01 , 2025 | 09:49 PM

Youtube India: కేవలం ఒక సంవత్సంలో 100 మిలియన్లకుపైగా ఉన్న ఛానళ్లలో పెద్ద మొత్తంలో వీడియోలు అప్‌లోడ్ అయినట్లు యూట్యూబ్ ఇండియా సీఈఓ నీల్ మోహన్ తెలిపారు. 100 మిలియన్లలో 15 వేల మంది వన్ మిలియన్‌కు పైగా సబ్‌స్క్రైబర్లను కలిగి ఉన్నారని ఆయన వెల్లడించారు.

Youtube India: ఇట్స్ అమేజింగ్.. యూట్యూబ్ నుంచి వేల కోట్లు సంపాదిస్తున్న ఇండియన్స్..
Youtube India

యూట్యూబ్ ఒకప్పుడు వీడియోలు చూడ్డానికి మాత్రమే పనికి వచ్చే మాధ్యమంగా ఉండేది. కానీ, ఇప్పుడు.. డబ్బులు సంపాదించి పెట్టే ‘ అల్లాద్దీన్ అద్భుత దీపం’గా మారిపోయింది. చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలి వాళ్ల దగ్గరి వరకు యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు. పేద కుటుంబం నుంచి వచ్చి.. యూట్యూబ్ ద్వారా కోట్లు సంపాదించిన వారు కూడా ఉన్నారు. యూట్యూబ్ నుంచి వచ్చే ఆదాయం చూసి సెలెబ్రిటీలకు కూడా కన్నుకుడుతోంది. అందుకే వాళ్లు కూడా ఛానళ్లు పెట్టి వీడియోలు చేసేస్తున్నారు. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉన్న కంటెంట్ క్రియేటర్లు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ విషయాన్ని యూట్యూబ్ ఇండియా సీఈఓ నీల్ మోహన్ స్వయంగా వెల్లడించారు.


ముంబైలో జరిగిన వరల్డ్ ఆడియో విజువల్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమిట్ ( WAVES)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూట్యూబ్ నుంచి ఇండియన్ కంటెంట్ క్రియేటర్స్ సంపాదనను వెల్లడించారు. కేవలం ఒక సంవత్సంలో 100 మిలియన్లకుపైగా ఉన్న ఛానళ్లలో పెద్ద మొత్తంలో వీడియోలు అప్‌లోడ్ అయినట్లు ఆయన తెలిపారు. 100 మిలియన్లలో 15 వేల మంది వన్ మిలియన్‌కు పైగా సబ్‌స్క్రైబర్లను కలిగి ఉన్నారని వెల్లడించారు. గత మూడేళ్లనుంచి ఇండియన్ క్రియేటర్లకు, ఆర్టిస్టులకు, మీడియా కంపెనీలకు కలిపి 21 వేల కోట్ల రూపాయలు చెల్లించినట్లు పేర్కొన్నారు.


ఇండియన్ క్రియేటర్ ఎకానమీపై పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్నట్లు ఆయన తెలిపారు. రానున్న రెండేళ్లలో దాదాపు 850 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఇండియన్ క్రియేటర్ ఎకానమీని బూస్ట్ చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘సినిమాలు, సంగీతంలో మాత్రమే కాదు.. కంటెంట్‌ను క్రియేట్ చేయటంలోనూ ఇండియా తన సత్తా చాటుతోంది. క్రియేటర్ నేషన్‌గా మారింది’ అని అన్నారు. కాగా, యూట్యూబ్ 2005, ఫిబ్రవరి 14న ప్రారంభమైంది. ఏడాది ఫిబ్రవరి 14కు 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రత్యర్థులంటూ ఎవరూ లేకుండా ముందుకు దూసుకుపోతోంది.


ఇవి కూడా చదవండి

Viral Video: పెళ్లికి ముందు అనుకోని సంఘటన.. మండపంగా మారిన ఆస్పత్రి..

Vijay Devarakonda: ‘రెట్రో’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎఫెక్ట్.. హీరో విజయ్ దేవరకొండపై కేసు

Updated Date - May 01 , 2025 | 09:49 PM