Share News

BSNL Offer: బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్‌ ఆఫర్‌

ABN , Publish Date - Aug 02 , 2025 | 03:27 AM

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు

BSNL Offer: బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్‌ ఆఫర్‌

రూపాయికే నెల రోజుల 4జీ ప్లాన్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఫ్రీడమ్‌ ప్లాన్‌ పేరుతో కేవలం రూపాయికే నెల రోజుల గడువుతో కూడిన 4జీ సేవల ప్లాన్‌ను శుక్రవారం ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్‌ పరిమిత కాలం పాటే అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. బీఎ్‌సఎన్‌ఎల్‌ దేశవ్యాప్తంగా తన 4జీ సేవలను ఈ మధ్యనే అందుబాటులోకి తీసుకు వచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల సందర్భగా సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ సేవలను రూపాయికే నెల రోజులపాటు వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది. బీఎ్‌సఎన్‌ఎల్‌ పోటీదారులైన రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా ఇదే తరహా ప్రీ-పెయిడ్‌ ప్లాన్‌ను నెలకు రూ.349-399 స్థాయిలో అందిస్తున్నాయి.

ఫ్రీడమ్‌ ప్లాన్‌ వివరాలు

  • అపరిమిత వాయిస్‌ కాల్స్‌ (లోకల్‌/ఎ్‌సటీడీ)

  • రోజుకు 2జీబీ హైస్పీడ్‌ డేటా

  • రోజుకు 100 ఎస్‌ఎంఎ్‌సలు

  • ఉచిత బీఎ్‌సఎన్‌ఎల్‌ సిమ్‌

Updated Date - Aug 02 , 2025 | 03:27 AM