Share News

Bill Gates: ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్‌కు అరుదైన వ్యాధి

ABN , Publish Date - May 02 , 2025 | 02:50 PM

Bill Gates: ఈ వ్యాధి ఉన్న వారు చేసిన పనినే మళ్లీ మళ్లీ చేస్తూ ఉంటారు. ఇతరులతో మాట్లాడాలన్నా.. ఇతరులతో కలవాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని విషయాలపై వీరికి అమితమైన ఆసక్తి ఉంటుంది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ కారణంగా కమ్యూనికేషన్, ఇతరులతో ఎలా మెలాగాలో సరిగా తెలీదు.

Bill Gates: ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్‌కు అరుదైన వ్యాధి
Bill Gates

ప్రపంచ కుబేరుడు, మైక్రో సాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌గేట్స్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారట. ఆ వ్యాధి కారణంగా ఆయన జనాలతో సరిగా కలవలేకపోతున్నారట. ఈ విషయాన్ని బిల్‌గేట్స్ కూతురు ఫోబీ గేట్స్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘ కాల్ హర్ డాడీ’ ఇంటర్వ్యూలో 22 ఏళ్ల ఫోబీ గేట్స్ మాట్లాడుతూ.. ‘ నేను నా బాయ్ ఫ్రెండ్స్‌ను నాన్న దగ్గరకు తీసుకెళ్లే దాన్ని. ఆయన వారిని కలవడానికి చాలా ఇబ్బందిగా ఫీలయ్యే వాడు. నాకది తమాషాగా అనిపించేది. తనకు ఆస్పర్జర్ సిండ్రోమ్ ఉందని నాన్నచెప్పాడు. దాని గురించి విని నాకు నవ్వొచ్చింది’ అని అంది.


69 ఏళ్ల బిల్‌గేట్స్ ఓ జాతీయ మీడియాకు తన వ్యాధిపై క్లారిటీ ఇచ్చారు. సదరు జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘ ఇప్పటి పరిస్థితుల్లో గనుక నేను పెరిగి ఉంటే.. కచ్చితంగా నాకు ఆస్టిజం ఉందని తేలేది. నేను ఆస్టిజం ఉందా.. లేదా.. అని టెస్టులు చేయించుకోలేదు. డాక్టర్లు నాకు ఆస్టిజం ఉందని టెస్టులు చేసి చెప్పలేదు. నా ప్రవర్తన ఎందుకలా ఉందో మా అమ్మానాన్నలకు అర్థం అయ్యేది కాదు. అది ఓ వ్యాధి అని తెలుసుకోవడానికి అప్పుడు అంత టెక్నాలజీ కూడా లేదు. చిన్నప్పుడు నా ప్రవర్తనతో వారు చాలా ఇబ్బందిపడేవారు.


ఓ సారి మా అమ్మానాన్న నన్ను థెరపిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన నా ప్రవర్తనను మార్చడానికి చాలా ప్రయత్నించారు. నా లోపాన్ని పాజిటివ్‌గా చూపించడంలో విజయం సాధించాడు’ అని అన్నారు. ఇక, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ విషయానికి వస్తే.. ఈ వ్యాధి ఉన్న వారు చేసిన పనినే మళ్లీ మళ్లీ చేస్తూ ఉంటారు. ఇతరులతో మాట్లాడాలన్నా.. ఇతరులతో కలవాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని విషయాలపై వీరికి అమితమైన ఆసక్తి ఉంటుంది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ కారణంగా కమ్యూనికేషన్, ఇతరులతో ఎలా మెలాగాలో సరిగా తెలీదు.


ఇవి కూడా చదవండి

Pehalgam Terror Attack: కరడుకట్టిన ఉగ్రవాదులు వీళ్లే..

Daku Dulhan Arrest: డాకూ దుల్హన్.. వయసు 21.. 12 మందితో పెళ్లి..

Updated Date - May 02 , 2025 | 02:52 PM