Bank Holiday: ఏప్రిల్ 18న బ్యాంకులు బంద్..ఒక రోజు తర్వాత మళ్లీ సెలవు..
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:04 PM
ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులకు చాలా ప్రత్యేకమైన రోజు. అయితే ఈ రోజున బ్యాంకులకు సెలవు ఉందా లేదా, ఉంటే ఏ ప్రాంతాల్లో హాలిడే ఉందనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్ ఫ్రైడే క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి. యేసు క్రీస్తు శిలువపై త్యాగం చేసిన ఈ రోజును వారు ప్రార్థనలతో నిర్వహించుకుంటారు. అయితే ఈసారి గుడ్ ఫ్రైడే 2025 ఏప్రిల్ 18న శుక్రవారం రోజు వస్తుంది. దేశవ్యాప్తంగా ఈరోజు కొన్ని ప్రాంతాల్లో అధికారిక సెలవుగా గుర్తించబడినప్పటికీ, ఇతర ప్రాంతాల్లో మాత్రం సాధారణ పనిదినంగా ఉంటుంది. అయితే బ్యాంకుల విషయంలోనూ ఇదే రూల్ వర్తిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పూర్తిగా మూసివేయబడితే, మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం వాటి పని కొనసాగుతుంది.
రాష్ట్రాల వారీగా సెలవు ఉంటుందా..
ఈ క్రమంలో బ్యాంకు పనులు ఉన్న వారు మీరుండే ప్రాంతంలో గుడ్ ఫ్రైడే రోజు సెలవు ఉందా, లేదా అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్ వంటి ఇతర ఆర్థిక సేవలను నిర్వహించాలంటే తప్పనిసరిగా బ్యాంకు సెలవుల గురించి తెలుసుకోవాలి. ఈ క్రమంలో మనం రాష్ట్రాల వారీగా గుడ్ ఫ్రైడే సందర్భంగా బ్యాంకులు ఎక్కడెక్కడ పనిచేస్తాయి. ఎక్కడ పనిచేయవనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాంకులు ఏప్రిల్ 18న మూసివేయబడతాయా..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల జాబితా ప్రకారం, గుడ్ ఫ్రైడే 2025 (ఏప్రిల్ 18న) రోజున కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే దేశవ్యాప్తంగా ప్రభుత్వ సెలవుదినం కాదు, కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా త్రిపుర, చంఢీగఢ్, అసోం, జైపూర్, జమ్మూ, సిమ్లా, శ్రీనగర్ ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా సెలవు ఉంది. ఇక ఏప్రిల్ 19న మూడో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు తెరిచి ఉంటాయి. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 20న ఆదివారం మళ్లీ బ్యాంకులకు సెలవు ఉంటుంది.
బ్యాంకింగ్ సేవలు
అయితే బ్యాంకులు మూసివేయబడినప్పటికీ, వినియోగదారులు డిజిటల్ సేవలను ఉపయోగించుకోవచ్చు. UPI చెల్లింపులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ATM, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలను ఉపయోగించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
IMD: ఐఎండీ అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో ఏప్రిల్ 19 వరకు భారీ వర్షాలు
WhatsApp Security: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందా..ఇలా ఈజీగా మళ్లీ యాక్సెస్ పొందండి..
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..
Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి
Read More Business News and Latest Telugu News