Bank Holidays: జూన్ 2025లో బ్యాంకు సెలవులు..ఎప్పుడు, ఎక్కడ బంద్ ఉంటాయో తెలుసా..
ABN , Publish Date - May 24 , 2025 | 10:42 AM
ఇంకొన్ని రోజుల్లో జూన్ 2025 రాబోతోంది. అయితే ఈ నెలలో మీకు ఏదైనా బ్యాంకు పనులు ఉన్నాయా. ఉంటే మాత్రం ఈ సెలవుల గురించి తెలుసుకోవడం తప్పనిసరి. ఈ క్రమంలో ఎన్ని రోజులు బ్యాంకులు (Bank Holidays June 2025) పనిచేస్తాయి. ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

మే నెల దాదాపు చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో జూన్ రానుంది. ఈ నేపథ్యంలో జూన్ 2025లో ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేస్తాయి. ఎన్ని రోజులు సెలవు దినాలు ఉన్నాయనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఈ సెలవులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్యాలెండర్ ప్రకారం నిర్ణయించబడ్డాయి. సాధారణంగా బ్యాంకు సెలవులు (Bank Holidays June 2025) అనేక మందిని ప్రభావితం చేస్తాయి. జూన్ నెలలో బ్యాంకులు 12 రోజుల పాటు బంద్ ఉంటాయి. ఇందులో స్థానిక పండుగలు, జాతీయ సెలవులు, రెండో, నాల్గవ శనివారాలు, అలాగే ఆదివారాలు ఉన్నాయి. ఈ సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి.
జూన్ 2025 బ్యాంకు సెలవుల జాబితా
జూన్ 6, 2025 – ఈద్-ఉల్-అదా (బక్రీద్): ఈ రోజు తిరువనంతపురం, కొచ్చిలో బ్యాంకులు మూసివుంటాయి.
జూన్ 7, 2025 – బక్రీద్ (ఈద్-ఉజ్-జుహా): ఈ రోజు దాదాపు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివుంటాయి. అగర్తలా, ఐజ్వాల్, బెలాపూర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గౌహతి, హైదరాబాద్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), ఇంఫాల్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోహిమా, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూ ఢిల్లీ, పణజి, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, షిమ్లా, శ్రీనగర్‌లలో బ్యాంకులు బంద్ ఉంటాయి.
జూన్ 11, 2025 – సంత్ గురు కబీర్ జయంతి /సాగా దావా: ఈ రోజు గ్యాంగ్‌టక్, సిమ్లాలో బ్యాంకులకు సెలవు. సంత్ గురు కబీర్ జయంతిని ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్‌లో జరుపుకుంటారు. సిక్కింలో కూడా ఇది ముఖ్యమైన బౌద్ధ పండుగ.
జూన్ 27, 2025 – రథయాత్ర /కాంగ్ (రథజాత్ర): భువనేశ్వర్, ఇంఫాల్‌లో ఈ రోజు బ్యాంకులకు సెలవు. రథ యాత్ర ఒడిశాలో జరిగే ఒక ప్రముఖ హిందూ పండుగ, ఇది భగవాన్ జగన్నాథుని గౌరవార్థం జరుపుకుంటారు.
జూన్ 30, 2025 – రెమ్నా నీ: ఐజ్వాల్‌లో ఈ రోజు బ్యాంకులకు సెలవు. రెమ్నా నీ అనేది మిజోరాంలో జరిగే స్థానిక పండుగ, ఇది స్థానిక సంస్కృతికి సంబంధించినది.
జూన్ 14, జూన్ 28 తేదీలలో రెండు, నాల్గో శనివారాలు బ్యాంకులకు హాలిడే
జూన్ 2025లో మొత్తం 5 ఆదివారాలు ఉన్నాయి (జూన్ 1, 8, 15, 22, 29). ఈ రోజుల్లో కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి.
సెలవు రోజుల్లో బ్యాంకింగ్ సేవలు
బ్యాంకులు మూసివున్నప్పటికీ సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుత డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సేవలు ఆన్లైన్లో కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, యూపీఐ, డిజిటల్ వాలెట్లు, ఏటీఎంల ద్వారా మీరు సెలవు రోజుల్లో కూడా డబ్బు బదిలీ, బిల్ చెల్లింపులు చేసుకోవచ్చు. అందుకే బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ ఆన్లైన్ సేవలు మాత్రం మీకు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీరు బ్యాంకులకు తప్పనిసరిగా వెళ్లాలని బావిస్తే.. బ్యాంకింగ్ సెలవులను దృష్టిలో ఉంచుకుని మీ ఆర్థిక పనులను ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఇవీ చదవండి:
నేడు 10వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం
వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్లు తయారు చేస్తే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి