Bank Holidays: జులైలో బ్యాంకు సెలవులు.. ఎన్ని రోజులు పనిచేస్తాయంటే..
ABN , Publish Date - Jun 28 , 2025 | 09:44 AM
ప్రతి నెలలో మాదిరిగానే ఈసారి కూడా బ్యాంకు సెలవుల జాబితా వచ్చేసింది. అయితే ఈసారి రానున్న జులై నెలలో ఎన్ని రోజులు సెలవులు (Bank Holidays July 2025) ఉన్నాయి. ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేస్తాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో బ్యాంకులకు సంబంధించిన చాలా పనులు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. అయినప్పటికీ బ్యాంకులకు వెళ్లాల్సిన పనులు కూడా ఉంటాయి. వాటిలో రుణ సంబంధిత పనులు, పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేయడం, చెక్‌బుక్ జారీ చేయడం వంటివి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు బ్యాంకులకు (Bank Holidays July 2025) వెళ్లాలని భావిస్తే, ముందుగా ఈ సెలవుల జాబితాను చూసుకోండి. సెలవుల గురించి తెలుసుకుని మీరు బ్యాంకులకు వెళితే సజావుగా మీ పనులను పూర్తి చేసుకోవచ్చు. ఈసారి జులై నెలలో మొత్తం 13 రోజులు బ్యాంకులు బంద్ ఉండగా, మిగతా 18 రోజులు పనిచేస్తాయి. వీటిలో శని, ఆదివారపు సెలవులు కూడా ఉన్నాయి.
జులై 2025లో బ్యాంకు సెలవులు
3 జులై 2025: ఖర్చీ పూజ కారణంగా ఈ రోజు అగర్తల జోన్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి
5 జులై 2025: గురు హరగోబింద్ పుట్టినరోజు కారణంగా ఈ రోజు జమ్మూ కాశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు
6 జులై 2025: ఆదివారం కారణంగా ఈ రోజు బ్యాంకులకు హాలిడే
12 జులై 2025: రెండో శనివారం కారణంగా ఈ రోజు బ్యాంకులు బంద్ ఉంటాయి
13 జులై 2025: ఆదివారం కారణంగా ఈ రోజు బ్యాంకులు మూసివేయబడతాయి
14 జులై 2025: బెహ్ దింఖ్లామ్ కారణంగా ఈ రోజు షిల్లాంగ్ జోన్‌లో బ్యాంకులకు హాలిడే
16 జులై 2025: హరేలా పండుగ కారణంగా ఈ రోజు డెహ్రాడూన్ జోన్‌లో బ్యాంకులకు సెలవు
17 జులై 2025: ఉ తిరోత్ సింగ్ వర్ధంతి కారణంగా ఈ రోజు షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు
19 జులై 2025: కేర్ పూజ కారణంగా ఈ రోజు అగర్తల జోన్‌లో బ్యాంకులు బంద్
20 జులై 2025: ఆదివారం కారణంగా ఈ రోజు బ్యాంకులకు సెలవు
26 జులై 2025: నాలుగో శనివారం కారణంగా ఈ రోజు బ్యాంకులు బంద్
27 జూలై 2025: ఆదివారం కారణంగా ఈ రోజు బ్యాంకులకు హాలిడే
28 జులై 2025: ద్రుక్పా త్సే జీ కారణంగా ఈ రోజు గ్యాంగ్‌టాక్ జోన్‌లో బ్యాంకులకు సెలవు
ఈ సెలవుల గురించి జాగ్రత్త
మీరు రుణ సంబంధిత బ్యాంకు పనులను పూర్తి చేయాలనుకున్నా లేదా ముఖ్యమైన లావాదేవీ చేయవలసి వచ్చినా, ఈ సెలవుల గురించి ముందుగా తెలుసుకోవడం వల్ల ఇబ్బందులు లేకుండా ఉంటారు. ముఖ్యంగా బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన వారు ఈ సెలవుల గురించి తెలుసుకోవాలి. ఇది కాకుండా మీకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సౌకర్యం ఉంటే మీరు ఇంట్లో కూర్చొని కూడా మీ పనులను సులభంగా నిర్వహించుకోవచ్చు.
ఇవీ చదవండి:
సిబిల్ స్కోర్ కారణంగా ఉద్యోగం తొలగింపు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
జూన్ 30లోపు ముగియాల్సిన ఆర్థిక కార్యకలాపాలు ఇవే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి