Bank Holidays July 2025: జూలై 2025లో బ్యాంకు సెలవులు.. ఇదే పూర్తి లిస్ట్..
ABN , Publish Date - Jun 23 , 2025 | 10:52 AM
ఈ నెలలో బ్యాంకులకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ముందే జూలైలో బ్యాంకులు ఎప్పుడు బంద్ (Bank Holidays July 2025) ఉంటాయి, ఎప్పుడు పనిచేస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సెలవు రోజుల్లో బ్యాంకులకు వెళితే మాత్రం ఇబ్బందులు పడతారు.

మీరు జూలై నెలలో బ్యాంకులకు సంబంధించి ఏదైనా పని కోసం వెళ్లాలని చూస్తున్నారా. అయితే అంతకు ముందే జూలై నెలలో బ్యాంకులు ఎప్పుడు బంద్ (Bank Holidays July 2025) ఉంటాయి, ఎప్పుడు పనిచేస్తాయనే విషయాలను తెలుసుకోండి మరి. లేదంటే సెలవుల రోజు మీరు తెలియకుండా బ్యాంకు పనుల కోసం వెళితే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రతి నెల ప్రారంభానికి ముందు బ్యాంకు సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేస్తుంది. దీని ప్రకారం ఈసారి జూలై నెలలో 13 రోజులు బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఈ క్రమంలో భారతదేశంలోని ఏ రాష్ట్రం లేదా నగరంలో, ఏ కారణంతో బ్యాంకులు మూసివేయబడతాయో తెలుసుకోవచ్చు.
జూలై 2025లో బ్యాంకు సెలవుల జాబితా
3 జూలై 2025- ఖర్చీ పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులు మూసివేయబడతాయి
5 జూలై 2025- గురు హర్‌గోబింద్ జీ పుట్టినరోజు సందర్భంగా జమ్మూ శ్రీనగర్‌లో బ్యాంకులు బంద్ ఉంటాయి
6 జూలై 2025- ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
12 జూలై 2025- నెలలో రెండో శనివారం దేశంలోని అన్ని బ్యాంకులకు హాలిడే
13 జూలై 2025- ఆదివారం కారణంగా అన్ని బ్యాంకులకు వారాంతపు సెలవు
14 జూలై 2025- బెహ్ దీంక్లాం కారణంగా షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు
16 జూలై 2025- హరేలా పండుగ కారణంగా డెహ్రాడూన్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి
17 జూలై 2025- ఉ తిరోత్ సింగ్ వర్ధంతి సందర్భంగా షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు
19 జూలై 2025- కేర్ పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులకు హాలిడే
20 జూలై 2025- ఆదివారం వారాంతపు సెలవు
26 జూలై 2025- ఈ నెలలో నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
27 జూలై 2025- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు హాలిడే
28 జూలై 2025- ద్రుక్పా షె జీ సందర్భంగా గాంగ్‌టక్‌లో బ్యాంకులు బంద్ ఉంటాయి
బ్యాంకులు 13 రోజులు బంద్
ఆదివారం, రెండో, నాలుగో శనివారం కాకుండా, ఇతర ప్రత్యేక కారణాల వల్ల కూడా బ్యాంకులు మూసివేయబడవచ్చు. బ్యాంకు సెలవు రోజుల్లో, మీరు ఆన్‌లైన్ సేవలను ఉపయోగించుకుని మీ ఆర్థిక పనులను సులభంగా నిర్వహించుకోవచ్చు. డిజిటల్ చెల్లింపులు చేయడం, బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ తనిఖీ చేయడం వంటి సేవలు బ్యాంకు సెలవు రోజుల్లో కూడా అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా, బ్యాంకు సెలవులు మీకు అనుకూలంగా లేకపోయినా, ఆన్‌లైన్ సదుపాయాలు మీ అనేక పనులను సాఫీగా, వేగంగా చేసుకోవడానికి సహాయపడతాయి.
ఇవీ చదవండి:
1600 కోట్ల పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్.. హెచ్చరించిన గూగుల్
ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి