Apple Invest: ఆపిల్ 500 బిలియన్ డాలర్ల పెట్టుబడి.. 20 వేల ఉద్యోగాలు..
ABN , Publish Date - Feb 25 , 2025 | 08:33 PM
ప్రముఖ టెక్ సంస్థ ఆపిల్ పెట్టుబడుల గురించి బిగ్ అప్‌డేట్ ఇచ్చేసింది. ఈ క్రమంలో రాబోయే నాలుగేళ్లలో అమెరికాలో 500 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో మరో 20 వేల మందికి జాబ్స్ కూడా అందిస్తామని కంపెనీ ప్రకటించింది.

స్మార్ట్‌ఫోన్ దిగ్గజ సంస్థ ఆపిల్(Apple) కీలక ప్రకటన చేసింది. అమెరికాలో రాబోయే నాలుగేళ్లలో 500 బిలియన్ డాలర్ల (రూ. 4,35,91,33,30,00,000) పెట్టుబడిని పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో 20,000 కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని కంపెనీ తెలిపింది. ఈ పెట్టుబడిలో హ్యూస్టన్‌లో కొత్త సర్వర్ తయారీ కేంద్రం, మిచిగాన్‌లో సరఫరాదారుల అకాడమీ నిర్మాణం, ప్రస్తుత సరఫరాదారులతో అదనపు పెట్టుబడులు కూడా ఉంటాయని తెలిపింది. ఈ క్రమంలో ఆపిల్ అమెరికాలోనే కృత్రిమ మేధస్సు సర్వర్‌లను ఉత్పత్తి చేస్తుంది.
ఆపిల్‌కు సుంకాల భయం
అయితే ఆపిల్ ఈ భారీ పెట్టుబడిని ప్రకటించడానికి కారణం ఏమిటంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా నుంచి వచ్చే వస్తువులపై సుంకాలు విధించాలనుకుంటున్నారు. ఈ సుంకాలు ఆపిల్‌కు తీవ్ర ప్రభావం చూపించనున్నారు. ప్రస్తుతం ఆపిల్ కంపెనీ తన ఉత్పత్తులలో ఎక్కువ భాగాన్ని చైనాలో తయారు చేస్తుంది. ఈ క్రమంలోనే ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల ట్రంప్‌ను కలిశారు. ఈ సమావేశం తరువాత ట్రంప్ మాట్లాడుతూ ఆపిల్ 100 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుందని, ఎందుకంటే వీరు సుంకాలు చెల్లించడానికి ఇష్టపడడం లేదని తెలిపారు.
ఆపిల్ గత పెట్టుబడులు
ఈ 500 బిలియన్ డాలర్ల పెట్టుబడి ఆపిల్ అమెరికాలో గతంలో చేసిన హామీల కంటే పెద్దది కావడం విశేషం. గత ఐదు సంవత్సరాలలో ఆపిల్ 20,000 మంది పరిశోధన, అభివృద్ధి కార్మికులను నియమించుకుంది. 2021లో ఆపిల్ స్థానికంగా 430 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెడతామని ప్రకటించింది. ఈ తాజా ప్రకటనతో ఆపిల్ తన గత ప్రకటనల కంటే ఎక్కువగా పెట్టుబడులు పెట్టనుంది. మా పనిపై నమ్మకం కారణంగా ఆపిల్ ఈ పెట్టుబడిని పెడుతోందని ట్రంప్ అన్నారు. ఈ క్రమంలో అమెరికన్ ఆవిష్కరణల భవిష్యత్తు గురించి మేము ఆశాజనకంగా ఉన్నామని టిమ్ కుక్ వెల్లడించారు.
భవిష్యత్తు దిశగా అడుగులు
ఈ పెట్టుబడితో ఆపిల్ అమెరికాలో కొత్త ఉద్యోగాలను సృష్టించడం, కృత్రిమ మేధస్సు సర్వర్‌లను ఉత్పత్తి చేయడం వంటి అనేక ప్రణాళికలను అమలు చేయాలని భావిస్తోంది. ఈ విధంగా ఆపిల్ అమెరికాలో తన వ్యాపారాన్ని విస్తరించడం, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయనుంది.
ఇవి కూడా చదవండి:
Amit Shah: 2 రోజుల్లోనే రూ. 30,77,000 కోట్ల పెట్టుబడులు.. కేంద్ర హోమంత్రి అమిత్ షా ప్రశంసలు
Liquor Scam: లిక్కర్ స్కాం వల్ల ప్రభుత్వానికి 2 వేల కోట్లకుపైగా నష్టం..
Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..
Maha Kumbh Mela: శివరాత్రికి ముందే మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం.. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారంటే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Read More Business News and Latest Telugu News