Amazon: ఈ డాట్ ఉంటే అమెజాన్, లేదంటే ఫేక్.. అలాంటి ఉత్పత్తులకు చెక్
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:31 PM
ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే మాకు ఫోన్ బదులు రాయి వచ్చిందని ఒకరు, డ్రెస్ బదులు సోప్ వచ్చిందని ఇంకొకరు. ఇలా ఇటీవల ఆన్‌లైన్ షాపింగ్ ఆర్డర్లలో మోసాలు పెరిగిపోయాయి. ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు అమెజాన్ (Amazon) కీలక నిర్ణయం తీసుకుంది.

ఆన్‌లైన్ షాపింగ్ ప్యాకేజింగ్‌లో జరిగే మోసాలను అరికట్టేందుకు అమెజాన్ (Amazon) సరికొత్తగా ముందుకొచ్చింది. వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, కొత్త టాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్ టెక్నాలజీను ప్రవేశపెట్టింది. ఈ టెక్నాలజీ సహాయంతో ఆ ప్యాకేజీని ఎవరైనా మార్చాలని చూస్తే వినియోగదారులకు వెంటనే సమాచారం అందుతుంది. ఇది భద్రతతో పాటు, వినియోగదారుల నమ్మకాన్ని కూడా పెంచేందుకు సహాయపడుతుంది.
పింక్ డాట్ ఉందా..
మారుతున్న కాలానికి తగ్గట్లు అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇకపై అమెజాన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే ఫేక్ ఉత్పత్తులు వచ్చే అవకాశం ఉండదు. ప్రస్తుతం అమెజాన్ డెలివరీ ప్యాకేజీ ట్యాంపర్ ప్రూఫ్ అవునా కాదా అని నిర్ధారించుకోవడానికి మీరు పింక్ డాట్‌ను తనిఖీ చేయాల్సి ఉంటుంది. మీరు అర్డర్ చేసిన ప్యాకేజీపై మీకు పింక్ డాట్ కనిపిస్తే అది టాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్ అని అర్థం.
టాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్ ఎలా పనిచేస్తుంది
అమెజాన్ ప్రవేశపెట్టిన టాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్‌లో ప్రత్యేకమైన సీల్ ఉంటుంది. ఈ సీల్‌లను వేడి లేదా ఇతర మార్పులతో తొలగిస్తే, దాని రంగు మారుతుంది. తద్వారా ప్యాకేజింగ్‌లో మార్పులు జరిగాయో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది టాంపరింగ్‌ను సూచిస్తుంది. ప్యాకేజింగ్‌లో మార్పులు జరిగినట్లయితే వినియోగదారులు వెంటనే తెలుసుకుంటారు. తద్వారా వారు అపరిచిత వస్తువులు పొందకుండా ఉంటారు. ఈ టెక్నాలజీ ద్వారా ఇతర ఉత్పత్తులు మార్కెట్లోకి రావడం తగ్గుతుంది. ప్రత్యేక ఐడీ కోడ్‌లు, OTP ధృవీకరణ ద్వారా ప్యాకేజింగ్ ట్రాకింగ్ కూడా ఈజీ అవుతుంది.
వినియోగదారులు ఏం చేయాలి
ఇలాంటి సమయంలో మీరు అమెజాన్ నుంచి వస్తువులు ఆర్డర్ చేసినప్పుడు, ప్యాకేజింగ్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. ప్యాకేజింగ్‌పై ఉన్న సీల్‌లను పరిశీలించి వాటి రంగులో మార్పు ఉందో లేదో గమనించాలి. ఏదైనా అనుమానం ఉంటే అమెజాన్ కస్టమర్ సపోర్ట్‌ను వెంటనే సంప్రదించాలి. అమెజాన్ ఈ టెక్నాలజీని ప్రస్తుతం ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులపై ప్రయోగిస్తోంది. భవిష్యత్తులో ఈ టెక్నాలజీని ఇతర ఉత్పత్తులపై కూడా విస్తరించడానికి యోచిస్తోంది.
ఇవీ చదవండి:
ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లను తిరిగి తీసుకుంటాం..
జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి