Amazon Prime Day Sale 2025: ఈ రాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్ షురూ.. వీటిపై ప్రత్యేక డిస్కౌంట్స్..
ABN , Publish Date - Jul 11 , 2025 | 09:18 PM
షాపింగ్ ప్రియులు రెడీనా. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేసింది. ఈ సారి ప్రైమ్ డే సేల్ జులై 12న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పలు ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

షాపింగ్ ప్రియులకు అలర్ట్. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day Sale 2025) కొద్ది సేపట్లో మొదలు కానుంది. ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్ జులై 12 నుంచి మొదలై, జులై 14 వరకు మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఉన్నాయి.
ఈ సేల్‌లో వన్‌ప్లస్, శాంసంగ్, ఐక్యూఓఓ, ఆపిల్ వంటి టాప్ బ్రాండ్‌ల నుంచి మొదలుకుని, తాజాగా విడుదలైన ఉత్పత్తులపై కూడా మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ స్పెషల్ ఆఫర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఈ సేల్‌లో ఏముంది?
ఈ మూడు రోజుల్లో ఈ ఏడాది, గత ఏడాది విడుదలైన టాప్ స్మార్ట్‌ఫోన్ మోడళ్లపై వేల రూపాయల తగ్గింపు పొందవచ్చు. వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఆర్, వన్‌ప్లస్ నార్డ్ 5, వన్‌ప్లస్ నార్డ్ 5 సీఈ, శాంసంగ్ గెలాక్సీ ఎమ్36, గెలాక్సీ ఎస్24, ఐక్యూఓఓ 13, ఐక్యూఓఓ జెడ్10, ఐక్యూఓఓ జెడ్10 లైట్, రెడ్‌మీ నోట్ 14, రెడ్‌మీ నోట్ 14 ప్రో వంటి ఫోన్‌లపై అదిరిపోయే డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.
స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, లెనోవో, డెల్, హెచ్‌పీ, ఏసర్ వంటి బ్రాండ్‌ల నుంచి ట్యాబ్, ల్యాప్‌టాప్‌లపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు లభిస్తాయి. ఈ సేల్‌లో మీకు కావాల్సిన డివైస్‌ను తక్కువ ధరలో సొంతం చేసుకోవడానికి మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు.
ఏసీ, రిఫ్రిజిరేటర్లపై భారీ తగ్గింపులు
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లపై కూడా ఆకర్షణీయమైన డీల్స్ ఉన్నాయి. శాంసంగ్, ఎల్‌జీ, డైకిన్, వోల్టాస్, బ్లూస్టార్ వంటి టాప్ బ్రాండ్‌ల నుంచి విండో, స్ప్లిట్ ఏసీ యూనిట్లు 1 టన్, 1.5 టన్, 2 టన్ సామర్థ్యంతో 50 శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర గృహోపకరణాలపై 70 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్‌లు కలవు. ఈ ఆఫర్లతో మీ ఇంటికి అవసరమైన ఉత్పత్తులను తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు.
వీరికి మాత్రమే ఈ సేల్
ఈ సేల్ అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే స్పెషల్. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను కొనుగోలు చేయడం ద్వారా మీరు ఈ ఆఫర్లను ఆస్వాదించవచ్చు. అమెజాన్ ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ప్లాన్ సంవత్సరానికి కేవలం రూ. 399 నుంచి ప్రారంభమవుతుంది. ఇది మీకు పూర్తి సంవత్సరం పాటు ప్రైమ్ సభ్యత్వ ప్రయోజనాలను అందిస్తుంది.
అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్ సంవత్సరానికి రూ. 799కి అందుబాటులో ఉంది. స్టాండర్డ్ ప్రైమ్ మెంబర్‌షిప్ కోసం, సంవత్సరానికి రూ. 1,499 లేదా నెలవారీ ప్లాన్ రూ. 299 నుంచి అందుబాటులో ఉంది. మీరు ఈ సేల్‌లోని అన్ని ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఉచిత డెలివరీ, ప్రైమ్ వీడియో వంటి ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి