Amazon Prime Day Sale 2025: మళ్లీ వచ్చిన అమెజాన్ ప్రైమ్ డే సేల్.. వీటిపై స్పెషల్ ఆఫర్స్..
ABN , Publish Date - Jul 02 , 2025 | 07:02 PM
షాపింగ్ మజా కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త వచ్చింది. అమెజాన్ మరోసారి భారీ ఆఫర్లతో సిద్ధమైంది. ఈసారి ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day Sale 2025) జూలై 12 నుంచి జూలై 14 వరకు మూడు రోజులపాటు జరగనుంది.

షాపింగ్ ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే అమెజాన్ నుంచి మరో సేల్ (Amazon Prime Day Sale 2025) వచ్చేసింది. ఈసారి ప్రైమ్ డే సేల్ జులై 12 నుంచి జులై 14 వరకు కొనసాగనుంది. ఇది ప్రధానంగా ప్రైమ్ సభ్యుల కోసం జులై 12 అర్ధరాత్రి 12:00 గంటల నుంచి జులై 14 రాత్రి 11:59 గంటల వరకు జరుగుతుంది. ఈ సేల్‌లో ప్రధానంగా స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, టీవీలు, గృహోపకరణాల సహా పలు వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ICICI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులు, SBI క్రెడిట్ కార్డులు లేదా EMIల ద్వారా చెల్లించే వారికి 10 శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
స్మార్ట్‌ఫోన్లు, యాక్సెసరీలపై ఆఫర్లు
ప్రైమ్ డే సేల్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల నుంచి కొత్త లాంచ్‌లు అందుబాటులో ఉంటాయి. వీటిలో Samsung Galaxy M36 5G, OnePlus Nord 5, OnePlus Nord CE5, iQOO Z10 Lite 5G, realme Narzo 80 Lite 5G, HONOR X9c 5G, Oppo Reno14 సిరీస్, Lava Storm Lite 5G, iQOO 13 వంటి ఇతర ఫోన్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్లు, యాక్సెసరీలపై 40 శాతం వరకు డిస్కౌంట్, 24 నెలల వరకు నో కాస్ట్ EMI ఆఫర్లు ఉన్నాయి. దీంతోపాటు రూ. 60,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ల డీల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్
ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీలు, హెడ్‌ఫోన్‌లపై 80 శాతం వరకు, వేరబుల్స్, కెమెరాలపై 50 శాతం వరకు, ల్యాప్‌టాప్‌లపై 40 శాతం వరకు, ట్యాబ్‌లపై 60 శాతం వరకు డిస్కౌంట్లు లభించనున్నాయి.
స్మార్ట్ టీవీలపై డీల్స్
టెలివిజన్లపై 65 శాతం వరకు డిస్కౌంట్, 10 శాతం తక్షణ బ్యాంక్ డిస్కౌంట్, అదనపు కూపన్ ఆఫర్లు, 24 నెలల వరకు నో-కాస్ట్ EMI, 3 సంవత్సరాల వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీలు, ఎక్స్చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. పాత టీవీని ఎక్స్చేంజ్ చేస్తే రూ. 7,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
గృహోపకరణాలపై ఆఫర్లు
LG, Samsung, Haier, Godrej, Carrier వంటి ప్రముఖ బ్రాండ్ల నుంచి గృహోపకరణాలపై 65 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. రూ. 17,000 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు, రూ. 5,000 వరకు అదనపు కూపన్ డిస్కౌంట్లతో ఎనర్జీ ఎఫిషియంట్ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లు, ఇతర గృహోపకరణాలను కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం
భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం కోసం మూడు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి:
వార్షిక ప్రైమ్ సభ్యత్వం (రూ. 1,499): షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయోజనాలు (ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్ వంటివి) అందుబాటులో ఉంటాయి.
ప్రైమ్ లైట్ (రూ. 799): పూర్తి షాపింగ్ ప్రయోజనాలతో పాటు పరిమిత ప్రైమ్ వీడియో యాక్సెస్ లభిస్తుంది
ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ (రూ. 399): షాపింగ్, షిప్పింగ్ ప్రయోజనాలు మాత్రమే, డిజిటల్ లేదా ఎంటర్‌టైన్‌మెంట్ సేవలు ఉండవు.
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి