Share News

AKSI Aerospace: రూ.44 కోట్లతో హైదరాబాద్‌ ప్లాంట్‌ విస్తరణ

ABN , Publish Date - Aug 02 , 2025 | 03:35 AM

అంతర్జాతీయ డ్రోన్‌ తయారీదారు ఫిక్సర్‌ నుంచి రూ.85 కోట్ల ఆర్డర్‌ను అందుకున్నట్లు ఏకేఎ్‌సఐ ఏరోస్పేస్‌

AKSI Aerospace: రూ.44 కోట్లతో హైదరాబాద్‌ ప్లాంట్‌ విస్తరణ

  • ఏకేఎస్ఐ ఏరోస్పేస్‌

ముంబై: అంతర్జాతీయ డ్రోన్‌ తయారీదారు ఫిక్సర్‌ నుంచి రూ.85 కోట్ల ఆర్డర్‌ను అందుకున్నట్లు ఏకేఎ్‌సఐ ఏరోస్పేస్‌ గ్రూప్‌ వెల్లడించింది. కంపెనీ హైదరాబాద్‌లోని ప్లాంట్‌లో డ్రోన్‌ డిజైన్‌, డ్రోన్‌ సబ్‌సిస్టమ్స్‌ తయారీ సహా ఆటోపైలెట్స్‌, లిథియం బ్యాటరీలు, బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ (బీఎంఎస్‌), నావిగేషన్‌ యూనిట్స్‌, కాంపోజిట్‌ ఎయిర్‌ఫ్రేమ్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. కాగా వచ్చే రెండేళ్లలో రూ.44 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌ ప్లాంట్‌ విస్తరణ, అప్‌గ్రేడేషన్‌ చేపట్టనున్నట్లు ఏకేఎ్‌సఐ ఏరోస్పేస్‌ ఎండీ పంకజ్‌ ఆకుల చెప్పారు. ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత కంపెనీ దేశీయంగా తయారు చేసిన డ్రోన్‌ కాంపోనెంట్స్‌కు మంచి గుర్తింపు లభించిందన్నారు. కంపెనీ తయారు చేసిన డ్రోన్స్‌ను భారత సైనిక దళాలు పూర్తి స్థాయిలో వినియోగించుకున్నాయని ఆయన వివరించారు. కాగా వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి కంపెనీ టర్నోవర్‌ రూ.35 కోట్ల నుంచి రూ.70 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు పంకజ్‌ చెప్పారు.


ఇవి కూడా చదవండి

తప్పతాగి డ్యూటీకి.. అడ్డంగా జనానికి దొరికిపోయిన ఎస్ఐ

మాజీ క్లర్క్ అవినీతి దందా.. 15వేల జీతం.. 30 కోట్ల ఆస్తులు

Updated Date - Aug 02 , 2025 | 05:46 AM