Share News

Credit Card Facts: క్రెడిట్ కార్డుల గురించి 6 అపోహలు.. అసలు నిజం ఏంటంటే

ABN , Publish Date - Jun 03 , 2025 | 03:09 PM

ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగిన నేపథ్యంలో దీనిపై అపోహలు కూడా క్రమంగా వ్యాపిస్తున్నాయి. ఇవి అప్పులో పడేస్తాయని, ఫీజులు భారీగా వసూలు చేస్తాయని, వీటి వాడకం వల్ల క్రెడిట్ స్కోర్ చెడిపోతుందని చాలామంది భావిస్తున్నారు. కానీ ఇటీవల వీటిపై ఓ ప్రముఖ బ్యాంక్ క్లారిటీ (Credit Card Facts) ఇచ్చింది.

Credit Card Facts: క్రెడిట్ కార్డుల గురించి 6 అపోహలు.. అసలు నిజం ఏంటంటే
Credit Card Facts

ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. అనేక మంది ఉద్యోగులు, వ్యాపారులు సైతం వీటిని తెగ (Credit Card Facts) వాడేస్తున్నారు. డీమార్ట్ షాపింగ్, ఆన్‌లైన్ కొనుగోలు చేయాలన్నా కూడా క్రెడిట్ కార్డులను విరివిగా వాడుతున్నారు. దీంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం అయినా కూడా పలువురు క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేయడం వల్ల పలు సందర్భాలలో డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. వీటిని క్యాష్‌బ్యాక్ చేసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు లభిస్తాయి.


రంగంలోకి దిగిన బ్యాంక్..

కానీ ఇదే సమయంలో క్రెడిట్ కార్డులకు సంబంధించిన కొన్ని అపోహలు కూడా పలువురిలో ఉన్నాయి. ఈ అపోహల గురించి సోషల్ మీడియాలో ప్రచారం పెరిగిన నేపథ్యంలో ఇటీవల HDFC బ్యాంక్ స్వయంగా తన వెబ్‌సైట్‌లో ఈ అపోహలను తొలగించింది. అయితే ప్రధానంగా ఎలాంటి అపోహలు ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గడం

మీరు కొత్త క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసుకున్నప్పుడు, బ్యాంక్ మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తుంది. దీనిని "హార్డ్ ఎంక్వైరీ" అని పిలుస్తారు. ఇలా పదే పదే చేయడం వల్ల మీ స్కోర్‌కు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. కానీ అది ఒకసారి జరిగితే, చింతించాల్సిన పని లేదు. మీ చెల్లింపులను సమయానికి చేస్తే స్కోరు మళ్లీ మెరుగుపడుతుంది.

ఒకటే క్రెడిట్ కార్డ్ బెటర్?

మీరు మీ ఖర్చులను నియంత్రించుకోగలిగితే, ఒకటి కంటే ఎక్కువ కార్డులు తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాంటి సమయంలో మీకు అధిక క్రెడిట్ పరిమితి లభిస్తుంది. మీరు వేర్వేరు కార్డులపై వేర్వేరు రివార్డు పాయింట్లను కూడా పొందవచ్చు. ఉదాహరణకు HDFC Regalia కార్డ్ అంతర్జాతీయ ప్రయాణంలో చాలా ప్రయోజనాలను అందిస్తుంది.


ఉపయోగించని కార్డులను క్లోజ్ చేయడం..

ఇది సరైన పద్దతి కాదని చెబుతున్నారు. క్రెడిట్ పరిమితి ఎక్కువగా ఉంటే, మీ 'క్రెడిట్ వినియోగం' తక్కువగా ఉంటుంది. ఇది క్రెడిట్ స్కోర్‌కు మంచిది. పాత కార్డును క్లోజ్ చేయడం వల్ల మీ మొత్తం పరిమితి తగ్గుతుంది. ఇది మీ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది.

క్రెడిట్ పరిమితిని పెంచకుండా

బ్యాంక్ మీ పరిమితిని పెంచుతుంటే, దానిని తిరస్కరించవద్దు. ఇది మీరు నమ్మకమైన రుణగ్రహీత అని గుర్తు చేస్తుంది. ఇది మీ ఖర్చు సామర్థ్యాన్ని పెంచడంతోపాటు మొత్తం క్రెడిట్‌తో పోలిస్తే అప్పు తక్కువగా కనిపిస్తుంది. ఇది మీ స్కోర్‌ను మెరుగుపరుస్తుంది.


ప్రతి నెలా వెంటనే చెల్లించడం..

సాధారణంగా ప్రతి నెలలో బిల్లులను పూర్తిగా చెల్లింపు చేయాలని చెబుతుంటారు. అలా కాకుండా వీలైనంత మేరకు చెల్లింపు చేసి, మిగతాది వచ్చే నెలలో కూడా చెల్లింపు చేసుకోవచ్చు. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీని వల్ల మీ సిబిల్ స్కోరుపై ఎలాంటి ప్రభావం ఉండదు.

వార్షిక రుసుములు

ప్రతి ఒక్కరి అవసరాలు భిన్నంగా ఉంటాయి. ఇదే సమయంలో రుసుములు వసూలు చేసే కార్డులు కూడా అనేక ప్రయోజనాలను అందిస్తాయి. HDFC ఇన్ఫినియా కార్డులో లాంజ్ యాక్సెస్, పర్సనల్ కన్సైర్జ్, డైనింగ్ డిస్కౌంట్లు, బీమా, ఉచిత గోల్ఫ్ వంటివి ఉన్నాయి. వీటన్నింటి ప్రయోజనాలను మీరు పరిశీలిస్తే, అవి వార్షిక రుసుముల కంటే చాలా ఎక్కువ కావడం విశేషం.


ఇవీ చదవండి:

ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లను తిరిగి తీసుకుంటాం..

జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 03:11 PM