Share News

Indian Railways Discount: రైలు రిజర్వేషన్ టికెట్‌పై 10 శాతం డిస్కౌంట్.. బెర్త్ కన్ఫర్మ్ ఎలాగో తెలుసా

ABN , Publish Date - Mar 10 , 2025 | 09:43 AM

భారతీయ రైల్వే రిజర్వేషన్లపై పది శాతం రాయితీ ఇస్తోంది. ఏ టికెట్లపై డిస్కౌంట్ అందిస్తోంది. ఈ రాయితీ ఏ సమయాల్లో వర్తిస్తుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం

Indian Railways Discount: రైలు రిజర్వేషన్ టికెట్‌పై 10 శాతం డిస్కౌంట్.. బెర్త్ కన్ఫర్మ్ ఎలాగో తెలుసా
Indian Railway

బస్సులు, విమాన టికెట్లపై ప్రయివేటు సంస్థలు తమ బిజినెస్ పెంచుకోవడానికి, ప్రయాణీకులను ఆకర్షించడానికి రకరకాల డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తుంటయి. అదే ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థలు రాయితీలు ప్రకటించడం చాలా అరుదు. ముఖ్యంగా అందరికీ అందుబాటులో ఉండే రైలు ప్రయాణానికి సంబంధించి రిజర్వేషన్ టికెట్లపై డిస్కౌంట్ ఇస్తుందని మీకు తెలుసా. అయితే ప్రతి రిజర్వేషన్ టికెట్‌పై ఈ ఆఫర్ వర్తించదు. డిస్కౌంట్ పొందాలంటే భారతీయ రైల్వే కొన్ని నియమ, నిబంధనలు విధించింది. ఈ రాయితీ రిజర్వేషన్ తరగతులకు మాత్రమే వర్తిస్తుంది. స్లీపర్, ఏసీ ఇలా అన్ని రకాల రిజర్వేషన్ టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. సాధారణంగా ఒక రైల్వే టికెట్ రూ.వెయ్యి ఉంటే డిస్కౌంట్‌లో రూ.900కే లభిస్తుంది. ఇప్పటికే సీనియర్ సిటిజన్, మీడియా సిబ్బందికి రాయితీలు ఎత్తివేసిన రైల్వే 10 శాతం డిస్కౌంట్ ఎందుకు ఇస్తుందో అర్థం కావడంలేదా. అసలు భారతీయ రైల్వే ఏ టికెట్లపై రాయితీ ఇస్తుంది. ఈ డిస్కౌంట్ పొందాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం.


ఆ టికెట్లపై మాత్రమే..

భారతీయ రైల్వే కరెంట్ రిజర్వేషన్ టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఒక రైలు బయలుదేరడానికి కనీసం నాలుగు గంటల ముందు చార్ట్ తయారవుతుంది. ఈ చార్ట్ ప్రిపరేషన్ తర్వాత ఆ రైలులో ఏవైనా బెర్తులు ఖాళీగా ఉంటే వాటిని కరెంట్ రిజర్వేషన్ కింద అందదుబాటులో ఉంచుతారు. రైలు బయలుదేరడానికి 30 నుంచి 60 నిమిషాల ముందువరకు కరెంట్ రిజర్వేషన్ టికెట్లు అందుబాటులో పెడతారు. ఈలోపు టికెట్లు బుక్ అయిపోతే బెర్తులు ఖాళీ లేవని చూపిస్తుంది. భారతీయ రైల్వే ఒక రైలులో మిగిలిపోయిన సీట్లన భర్తీ చేసుకునేందుకు పది శాతం డిస్కౌంట్ ప్రకటిస్తోంది. సాధారణ రిజర్వేషన్ సమయంలో కనిపించే టికెట్ ధర, కరెంట్ రిజర్వేషన్‌లో పది శాతం ధర తగ్గించి కనిపిస్తుంద.


ఎలా పొందాలి

ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లేదా రైల్వేస్టేషన్‌‌లోని కరెట్ రిజర్వేషన బుకింగ్ కౌంటర్ల వద్ద ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అన్ని రైల్వే స్టేషన్లలో ఈ విధానం అందుబాటులో ఉండదు. కేవలం ప్రధాన రైల్వే స్టేషన్లలో మాత్రమే కరెంట్ రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంటే ఎక్కడినుంచైనా చేసుకోవచ్చు. స్లీపర్ నుంచి ఫస్ట్ క్లాస్ ఏసీ వరకు ఏ తరగతిలో అయినా కరెంట్ రిజర్వేషన్ టికెట్ చేసుకుంటే పది శాతం డిస్కౌంట్ లభిస్తుంది. సాధారణంగా ప్రయాణీకుల రద్దీ లేని రైళ్లు, సమయాల్లో మాత్రమే కరెంట్ అవైల్‌బులిటీ చూపిస్తు్ంది. ప్రతి రైలులో, అన్ని సందర్భాల్లో ఈ టికెట్లు అందుబాటులో ఉండవు.

ఇవి కూడా చదవండి..

శ్రీలీలకు చిరంజీవి కానుక

పంచాయతీరాజ్‌ ప్రక్షాళన

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 10 , 2025 | 09:43 AM