Vastu Tips: ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నారా.. ఈ వాస్తు టిప్స్ పాటించండి..
ABN , Publish Date - Jun 22 , 2025 | 05:58 PM
ఇంట్లో ప్రశాంతత ఉండటం లేదా? ఈ వాస్తు టిప్స్ పాటిస్తే మీ బాధలు పోతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ కాలంలో మానసిక ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. అయితే మన ప్రాచీన వాస్తు శాస్త్రంలో కొన్ని సరళమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఇవి మన ఇంట్లో సానుకూల శక్తిని పెంచి, మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. మన ఇంటి వాతావరణాన్ని సరి చేసుకోవడం ద్వారా మనం మానసికంగా సంతోషంగా ఉండగలము.
వాస్తు ప్రకారం తెలుపు, పసుపు ఆకుపచ్చ రంగులు శాంతిని సూచిస్తాయి. ఈ రంగులలో ఉండే కొవ్వొత్తులను లేదా దీపాలను వెలిగించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రతి రోజూ దీపం వెలిగించి కనీసం కొన్ని నిమిషాలు ఆ ప్లేస్‌లో మెడిటేషన్ చేయడం వల్ల మనస్సు స్థిరంగా ఉంటుంది.
మనసుకు సానుకూలత
ఇంట్లో మంచి సువాసనలు వెదజల్లే అగర్బత్తులు, ఎసెన్షియల్ ఆయిల్స్ వాడటం ద్వారా మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. ఇవి నెగటివ్ ఎనర్జీని తొలగించి, చుట్టూ పాజిటివ్ వాతావరణాన్ని కలిగిస్తాయి.
ముఖద్వారం శుభ్రంగా ఉంచడం
ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా, ఆకర్షణీయంగా ఉండాలి. పక్కన చెత్తబుట్టలు లేదా షూ ర్యాక్‌లు పెట్టడం వలన ప్రతికూల శక్తి చేరే అవకాశం ఉంటుంది. ముఖద్వారం పాజిటివ్ శక్తి ప్రవేశానికి ద్వారం లాంటిది.
శుభ్రత
బెడ్‌రూమ్ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అనవసర వస్తువులు లేకుండా చూసుకోవాలి. భార్యాభర్తలు తల దక్షిణం లేదా తూర్పు వైపున పెట్టుకుని నిద్రపోవడం మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇది సంబంధాలను మెరుగుపరచడమే కాకుండా మంచి నిద్రకు సహాయపడుతుంది.
పాత వస్తువుల తొలగింపు
ఇంట్లో పాత, విరిగిన ఎలక్ట్రానిక్ వస్తువులు, పనిచేయని ఫర్నిచర్ వంటి వాటిని తొలగించండి. ఇవి ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఇంటికి ఉపయోగం లేని వస్తువులను తొలగించడం వలన శక్తి ప్రవాహం సజావుగా ఉంటుంది.
సానుకూల రంగులు
ఇంట్లో గోడలకు వేసే రంగులు, బెడ్ షీట్లు, కర్టెన్లు వంటి వస్తువుల విషయంలో ప్రశాంతతను కలిగించే రంగులను ఎంచుకోవాలి. పచ్చ, నీలం, తెలుపు వంటి రంగులు సౌమ్యతను కలిగించడంతో పాటు మనసుకి ఊరటనిస్తాయి.
వాస్తు అనేది కేవలం నిర్మాణ శాస్త్రం మాత్రమే కాదు. అది జీవన శైలిని మెరుగుపరచే శాస్త్రం. మానసిక ఆరోగ్యం కోసం ఈ సరళమైన వాస్తు చిట్కాలను పాటిస్తే మీరు మరింత ఆనందంగా, ప్రశాంతంగా జీవించవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
కళ్లలో దుమ్ము పడితే ఏం చేయాలి? ఏం చేయకూడదు?
శరీర దుర్వాసనతో బాధపడుతున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే తక్షణ ఫలితం
For More Lifestyle News