Dream Science: కలలో ఇవి కనిపిస్తున్నాయా.. మీ జీవితం నాశనం అవుతున్నట్లే..
ABN , Publish Date - May 17 , 2025 | 01:28 PM
ఈ రోజు మనం కలలో కనిపించే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. మీరు కలలో వీటిని చూసినట్లయితే అప్రమత్తంగా ఉండాలి. జీవితం నాశనం కాకముందు కలలో ఈ విషయాలు కనిపిస్తాయని కలల శాస్త్రం చెబుతుంది.

Dreams: కలలు కనడం అనేది మన మెదడులో జరిగే ఒక ప్రక్రియ. నిద్రలో మన మెదడు ఆలోచనలను, జ్ఞాపకాలను, భావాలను కలల రూపంలో వ్యక్తం చేస్తుంది. కొన్నిసార్లు, ఈ కలలు మన భవిష్యత్తును సూచిస్తాయి. మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. మనం నిద్రపోతున్నప్పుడు అనేక రకాల కలలు వస్తాయి. కలలో వచ్చే విషయాలను, వాటి అర్థాలను, వాటి భవిష్యత్తుపై ప్రభావం గురించి కలల శాస్త్రం వివరిస్తుంది. దీనిని డ్రీమ్ సైన్స్ అని కూడా అంటారు.
కలల శాస్త్రం ప్రకారం, కలలో వచ్చే విషయాల ఆధారంగా మనకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అనే విషయాలను తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, కలలో వర్షం కనిపిస్తే అది శుభప్రదమని, మనకు మంచి రోజులు వస్తాయని అర్థం. అలాగే, కలలో పక్షి ఎగురుతున్నట్లు కనిపిస్తే జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయని అర్థం. కలల శాస్త్రం ప్రకారం, మీరు మీ కలలో ఈ వస్తువులను చూసినట్లయితే మీ జీవితం నాశనం అవుతుందని సూచిస్తుంది. పొరపాటున కూడా వీటిని విస్మరించకూడదని నిపుణులు చెబుతున్నారు.
కలలో చిరిగిన బట్టలు చూడటం అశుభం
మీ కలలో చిరిగిన బట్టలు కనిపిస్తే పొరపాటున కూడా దానిని విస్మరించకూడదు. మీ కలలో అలాంటి బట్టలు చూస్తే జీవితంలో వైఫల్యాన్ని ఎదుర్కోబోతున్నారని సూచిస్తుంది. కలలో చిరిగిన బట్టలు చూడటం అంటే మీ శ్రమ వృధా అవుతుందని అర్థం.
సముద్రంలో లోతైన నీరు లేదా తుఫాను
మీ కలలో లోతైన నీరు కనిపిస్తే మీరు అప్రమత్తంగా ఉండాలి. కలలో సముద్రాన్ని చూడటం అంటే మీరు భావోద్వేగ స్థిరత్వాన్ని కోల్పోతారని అర్థం. కుటుంబంలో వివాదాన్ని కూడా సూచిస్తుంది.
కలలో దంతాలు రాలడం చూడటం
మీ కలలో దంతాలు రాలిపోతున్నట్లు మీరు చూసినట్లయితే మీ ఆత్మవిశ్వాసం తగ్గుతుందని అర్థం. అంతేకాకుండా, మీ విలువ తగ్గుతుందని సూచిస్తుంది.
Also Read:
Health Tips: పంటి నొప్పి ఉన్నప్పుడు వీటిని అస్సలు తినకండి..
Edi Rama welcomes Meloni: ఆ దేశాధినేత స్వాగతానికి మెలోని ఖుషీ.. వీడియో వైరల్..
Crocodile Viral Video: మొసలి బొమ్మ అనుకుని నీటిలోకి దిగాడు.. చివరకు గుండెలు ఆగిపోయే సీన్..