Vastu Tips: పేదరికానికి కారణం ఈ నాలుగు తప్పులే..
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:41 PM
ఇంట్లో ఈ నాలుగు వస్తువులను ఎప్పుడూ తెరిచి ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం, ఆర్థిక సమస్యలు వస్తాయని అంటున్నారు.

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని వస్తువులను ఇంట్లో తెరచి ఉంచకూడదు. ఎందుకంటే అవి ఆర్థిక సమస్యలను కలిగిస్తాయి. ముఖ్యంగా, ఇంట్లో ఈ నాలుగు వస్తువులను ఎప్పుడూ తెరిచి ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం, ఆర్ధిక సమస్యలు వస్తాయని అంటున్నారు. కాబట్టి, ఇంట్లో ఏ వస్తువులు తెరచి ఉంచడం మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉప్పు
వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగదిలో ఉప్పు డబ్బాను ఎప్పుడూ తెరిచి ఉంచకూడదు. జ్యోతిష్యంలో ఉప్పు చంద్రుడికి సంబంధించినది. ఉప్పు డబ్బాను తెరిచి ఉంచడం వల్ల జాతకంలో చంద్రుడు బలహీనపడతాడు. దీని కారణంగా వ్యక్తికి అనేక సమస్యలు వస్తాయి. వ్యక్తిగత జీవితం తోపాటు వృత్తి జీవితంలోనూ ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.
అల్మారా
ఇంట్లో అల్మారా తెరిచి ఉంచడం వల్ల ధన నష్టం కలుగుతుంది. ఎందుకంటే, వాస్తు శాస్త్రం ప్రకారం అల్మారా తలుపులు తెరిచి ఉంచకూడదు. అల్మారా తలుపులు తెరిచి ఉంచడం వలన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుందని, ఆర్థిక నష్టాలు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతోన్నారు.
ఆహార పదార్థాలు
ఇంట్లో ఆహార పదార్థాలను ఎప్పుడూ తెరిచి ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అన్నపూర్ణదేవి అనుగ్రహం ఉండదని అంటున్నారు. ఇంట్లో ఆహారం, డబ్బు కొరత సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
పాలు
వంటగదిలో పాలగిన్నె మూతను ఎప్పుడూ తెరిచి ఉంచకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఒక వ్యక్తి సంపద, శ్రేయస్సు తగ్గుతుందని అంటున్నారు. కాబట్టి, పొరపాటున కూడా పాలగిన్నె మూతను తెరచి ఉంచకూడదని చెబుతున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
రోజుకో ఆపిల్.. నిజంగా మంచిదేనా..
7 గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా.. ఈ వ్యాధులు తప్పవు..
For More Lifestyle News