Share News

కేంద్రంలో ఏ కూటమిలోనూ లేము: వైసీపీ సుబ్బారెడ్డి

ABN , Publish Date - Jul 04 , 2025 | 04:27 AM

ఎన్డీఏ, ఇండియా... ఏ కూటమిలోనూ వైసీపీ లేదు. బిహార్‌ తరహాలో ఏపీలోనూ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌కు కేంద్ర ఎన్నికల కమిషన్‌ హామీ ఇచ్చింది’ అని ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

కేంద్రంలో ఏ కూటమిలోనూ లేము: వైసీపీ సుబ్బారెడ్డి

న్యూఢిల్లీ, జూలై 3(ఆంధ్రజ్యోతి): ‘ఎన్డీఏ, ఇండియా... ఏ కూటమిలోనూ వైసీపీ లేదు. బిహార్‌ తరహాలో ఏపీలోనూ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌కు కేంద్ర ఎన్నికల కమిషన్‌ హామీ ఇచ్చింది’ అని ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీ సహా పలు పార్టీలతో సమావేశమైంది. సమావేశం అనంతరం వైవీ మీడియాతో మాట్లాడారు. ‘గత ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి. విజయనగరం పార్లమెంట్‌ ఎన్నికలోని ఈవీఎంలను, వీవీ పాట్లు మరోసారి సరిచూడాలని కోరాం. అది సాధ్యం కాదనీ ఈసీ చెప్పింది. సీసీ టీవీ ఫుటేజీ విడుదల చేయాలని కోరినా నిరాకరించింది. బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరాం’ అని ఎంపీ వైవీ తెలిపారు.

Updated Date - Jul 04 , 2025 | 04:28 AM