Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్
ABN , Publish Date - Jul 01 , 2025 | 06:15 PM
వైసీపీ నేత వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయలకు 2 ష్యూరిటీలు, వారానికి రెండు సార్లు స్టేషన్ కి రావాలంటూ షరతులు పెట్టింది. అయితే, వంశీ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో..

నూజివీడు, జూన్ 1: నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈ కేసుపై ఇవాళ (మంగళవారం) నూజివీడు కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. అనంతరం వంశీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయలకు 2 ష్యూరిటీలు, వారానికి రెండుసార్లు స్టేషన్ కి రావాలంటూ కోర్టు షరతులు పెట్టింది. వల్లభనేని వంశీ ఈ కేసులో ఇప్పటివరకూ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజా బెయిల్‌తో ఇంతవరకూ వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ ఆయనకి బెయిల్ మంజూరు అయినట్లయింది.
దీంతో రేపు(బుధవారం) జిల్లా జైలు నుంచి వంశీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంత కాలం రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి తాజా తీర్పు భారీ ఉపశమనమనే చెప్పాలి. అయితే, వంశీ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సదరు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరుగనుంది. దీంతో, వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ విడుదల అవుతారా, లేదా? అన్నది ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. కాగా, ఇప్పటివరకూ నమోదైన 10 కేసుల్లోనూ వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు అయ్యింది.
ఇవి కూడా చదవండి:
ఐఏఎస్ అని చెప్పుకుంటూ దర్జాగా కారులో షికార్లు.. పోలీసులకు చిక్కిన నిందితుడు
అగ్ని-5 బంకర్ బస్టర్ మిసైల్ అభివృద్ధికి నడుం కట్టిన డీఆర్‌డీఓ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి