Female Workforce: పూర్తి మహిళా సిబ్బందితో రైలు
ABN , Publish Date - Mar 09 , 2025 | 04:09 AM
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు శనివారం విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం..

విశాఖపట్నం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు శనివారం విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం రోడ్ వరకు ఒక రైలును పూర్తిగా మహిళా సిబ్బందితోనే నడిపారు. విశాఖ స్టేషన్‌లో ఈ రైలును తూర్పు కోస్తా రైల్వే మహిళల సంక్షేమ సంఘం వాల్తేరు డివిజన్ అధ్యక్షురాలు జ్యోత్స్న బొహ్ర జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం లలిత్ బొహ్ర మాట్లాడుతూ, మహిళలకు అన్ని విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగించే విషయంలో వాల్తేరు డివిజన్ ముందుందని చెప్పారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా మహిళా బృందాలే పనిచేస్తున్నాయని తెలిపారు.