Nallapureddy: మహిళా ఎమ్మెల్యేపై ఆ వ్యాఖ్యలేంటి? నల్లపురెడ్డిపై హైకోర్ట్ సీరియస్
ABN , Publish Date - Jul 15 , 2025 | 08:00 PM
వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పై ఏపీ హైకోర్ట్ సీరియస్ అయింది. మహిళా ఎమ్మెల్యేపై ఆ వ్యాఖ్యలు ఏంటి? అని నిలదీసింది. మాజీ ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవం ఇదేనా?

అమరావతి , జులై, 15: వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పై ఏపీ హైకోర్ట్ సీరియస్ అయింది. మహిళా ఎమ్మెల్యేపై ఆ వ్యాఖ్యలు ఏంటి? అని నిలదీసింది. మాజీ ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 'అలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించలేం అంటూ.. వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టింది హైకోర్టు.
కాగా, కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ఏపీ హైకోర్టు తీవ్రంగా మందలించింది. మహిళా ఎమ్మెల్యే పై ఆ వ్యాఖ్యలు ఏంటని నిలదీసిన హైకోర్ట్.. ఓ మాజీ ఎమ్మెల్యే ఆయి ఉండి.. ప్రస్తుత ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారు? అని ప్రశ్నించింది. మహిళా ఎమ్మెల్యేను గౌరవించేది ఇలాగేనా అని ప్రశ్నించింది. అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడిన హైకోర్ట్.. అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నియంత్రణలో ఉండాలని ఆదేశాలిచ్చింది.
అంతేకాదు.. మీ వ్యాఖ్యతో న్యూసెన్స్ చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన హైకోర్ట్.. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ప్రసన్నకుమార్ రెడ్డి తరపు న్యాయవాది సుభోద్ అభ్యర్ధనను తోసిపుచ్చింది. సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తారని, పిటిషనర్ పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అన్నీ ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవేనని న్యాయవాది సుభోద్ కోర్టు దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. విచారణను బుధవారానికి వాయిదా వేయాలని న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
Also Read:
Youth Fight: అర్ధరాత్రి రోడ్డుపై యువతీయువకుల హల్‌చల్..
MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్..!
For More Telangana News and Telugu News..