Share News

నీరు సముద్రం పాలవుతున్నా. శివారు గ్రామాలకు సాగునీరు ఇవ్వరా..?

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:43 AM

నదులు పొంగి నీరు సముద్రం పాలవుతున్నా శివారు గ్రామాలకు సాగునీరు సరఫరా చేయడంలో అధికారులు ఎందుకు విఫలమవుతున్నారని రైతులు మండిపడ్డారు.

 నీరు సముద్రం పాలవుతున్నా. శివారు గ్రామాలకు సాగునీరు ఇవ్వరా..?
రాచపట్నంలో ఇరిగేషన్‌ అధికారులను ప్రశ్నిస్తున్న రైతులు

ఇరిగేషన్‌ ఎస్‌ఈని ప్రశ్నించిన రైతులు

కైకలూరు, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): నదులు పొంగి నీరు సముద్రం పాలవుతున్నా శివారు గ్రామాలకు సాగునీరు సరఫరా చేయడంలో అధికారులు ఎందుకు విఫలమవుతున్నారని రైతులు మండిపడ్డారు. రాచపట్నంలో శనివారం పంట పొలాలను, పంట కాలువలను ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఆర్‌.మోహనరావు, సాగునీటి సంఘాల సభ్యులు, డీసీ చైర్మన్లు, రైతులతో కలిసి పరిశీలించారు. వేల టీఎంసీల నీరు ప్రకాశం బ్యారేజ్‌ నుంచి సముద్రంలోనికి నీరు వెళ్లిపోతుందని కానీ కాలువలకు సామర్థ్యం మేరకు నీరు సరఫరా చేయకపోవడంతో పంటలకు నీరు చాలక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఈ మాట్లాడుతూ కైకలూరు, కలిదిండి శివారు ప్రాంతాలకు నీరు అందించేందుకు కాలువకు వారాబందీ ప్రకారం నీటిని సరఫరా చేస్తామన్నారు. అనంతరం కైకలూరు ఇరిగేషన్‌ కార్యాలయంలో సాగు నీటి సంఘాల నాయకులు, అధికారులతో సమావేశాన్ని నిర్వహించా రు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ బి.ఆంజనేయ ప్రసాద్‌, ఇరిగేషన్‌, డ్రెయినేజీ డీఈలు శిరీష, రామకృష్ణ, డీసీ చైర్మన్‌లు వాసురాజు, సత్యనారాయణ, లక్ష్మీపతిరాజు, భోగేశ్వరరావు, కొండ, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 12:43 AM