ఉప్పుటేరు ఆక్రమణలు తొలగించాలి
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:13 AM
‘ఉప్పుటేరు ఆక్ర మణలు తొలగించకపోతే కొంప కొల్లేరే అనే నానుడి కచ్చితంగా జరుగుతుంది. ఉప్పుటేరు 237 మీటర్లు వెడల్పు ఉండాలి. కాని 60శాతం ఆక్రమణలకు గురైం ది. చేపలు, రొయ్యల చెరువులన్నీ రైతులే స్వచ్ఛం దంగా వారంలోగా తొలగించుకోవాలి. లేదంటే మేమే రోబో అవతారం ఎత్తి ప్రభుత్వ సహకారంతో చెరువు లను తొలగిస్తాం’ అంటూ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కను మూరి రఘురామకృష్ణరాజు హెచ్చరించారు.

వారం రోజులే రైతులకు గడువు.. లేకుంటే మేమే రోబో అవతారం ఎత్తుతాం
డిప్యూటీ స్పీకర్ రఘురామ హెచ్చరిక
కైకలూరు, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి):‘ఉప్పుటేరు ఆక్ర మణలు తొలగించకపోతే కొంప కొల్లేరే అనే నానుడి కచ్చితంగా జరుగుతుంది. ఉప్పుటేరు 237 మీటర్లు వెడల్పు ఉండాలి. కాని 60శాతం ఆక్రమణలకు గురైం ది. చేపలు, రొయ్యల చెరువులన్నీ రైతులే స్వచ్ఛం దంగా వారంలోగా తొలగించుకోవాలి. లేదంటే మేమే రోబో అవతారం ఎత్తి ప్రభుత్వ సహకారంతో చెరువు లను తొలగిస్తాం’ అంటూ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కను మూరి రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. కైకలూ రు మండలం కొట్టాడ, జంగంపాడు, పల్లిపాలెం ప్రాం తాల్లో శనివారం ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ తో కలిసి ఉప్పుటేరును పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ‘విజయవాడ వరదలకు ప్రధానంగా ముంపు సమస్య ఉప్పుటేరు, కొల్లేరు ప్రాంతమే. దీని ప్రక్షాళనతోనే ముంపు నివారణ చేయగలుగుతాం. ఉప్పుటేరు ఆక్రమణలు తొలగిస్తేనే కొల్లేరు క్షేమంగా ఉంటుంది. లేకుంటే ముంపుతో వచ్చే ఇబ్బందులను ఎవరూ ఊహించలేం. డ్రోన్ కెమె రాల సహాయంతో ఏ మేరకు ఆక్రమణలు గురైందో పరిశీలిస్తున్నాం. వీటి ఫొటోల ఆధారంగా జిల్లా కలెక్ట ర్లకు చూపించి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ల తాం. వర్షాకాలంలో చెరువులు ఆక్రమణలు తొలగిం చడం కష్టం. ముందుగానే జాగ్రత్తపడి తొలగించాలి. ఉప్పుటేరు వెంబడి అక్రమ ఇళ్ల నిర్మాణాలు సైతం తొలగించాలి. వారికి ప్రభుత్వం తరపున మరోచోట స్థలాలను కేటాయించి ఇళ్ల నిర్మాణాలకై రూ.2.9 లక్ష లు నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లా డుతూ అనేక డ్రెయిన్ల ద్వారా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలోని నీరంతా కొల్లేరు, ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్లాల్సి ఉందన్నారు. ఉప్పుటేరు వెంబడి ఆక్రమించిన రైతులు తమ చెరువులన్నీ రొయ్యలు, చేపలను ఖాళీ చేసి అప్పగించాలన్నారు. కొల్లేరు ప్రజలకు కాంటూరు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని సుప్రీంకోర్టు ఇచ్చిన 12 వారాల గడువులో పక్షులు, పర్యావర ణంతో పాటు ప్రజలు ఉన్నట్టు గుర్తించిం దన్నారు. త్వరలోనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. రాష్ట్ర టీడీపీ వడ్డీ సాధికారిక కమిటీ కన్వీనర్ బలే ఏసు రాజు, రాష్ట్ర చేపల రైతు సంఘం అధ్యక్షుడు నంబూరి వెంకటరామరాజు, ఎంపీపీ అడవి కృష్ణ, కూటమి నాయకులు పెన్మెత్స త్రినాథరాజు, పొత్తూరి వాసురాజు, పూల రామచంద్రరావు, కొల్లి వరప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.