ఎందుకిలా.. మందకొడిగా!
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:24 AM
వచ్చే మహానాడు లోపు అన్ని జిల్లాల్లోను సంస్థా గత ఎన్నికలను పూర్తి చేసేందుకు తెలుగుదేశం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి నిర్దిష్ట ప్రణాళికను పార్టీ సిద్ధం చేసింది.

టీడీపీ సంస్థాగతంలో నిర్లిప్తత
కార్యాచరణలో వెనుకబాటుతనం
అధికారంలో ఉన్నా పార్టీలో తడబాటు
కుటుంబ సాధికార సారథుల ఎంపికలోను ఆపసోపాలు
ఒక్క ఏలూరు, దెందులూరుల్లోనే జోరంతా
(ఏలూరు– ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
వచ్చే మహానాడు లోపు అన్ని జిల్లాల్లోను సంస్థా గత ఎన్నికలను పూర్తి చేసేందుకు తెలుగుదేశం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి నిర్దిష్ట ప్రణాళికను పార్టీ సిద్ధం చేసింది. ఆ దిశగా గడువులోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా జిల్లా నాయ కత్వాన్ని ఆదేశించింది. కుటుంబ సాధికార సారఽథులను ఎంపిక చేయ డంలోనే పూర్తిగా ముందుకు వెళ్లలేక పోతున్నారు. గ్రామ, బూత్ కమిటీల ప్రక్రియ వైపు తొంగి చూడలేదు. స్థానికంగా ఉన్న సమన్వయలోపం ప్రధాన కారణం గానే కనిపిస్తోంది. వచ్చే నెల 15లోపే సంస్థగత ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా, తొలి దశ కూడా పూర్తి కాలేదు.
తెలుగుదేశంలో ప్రతీ కార్యకర్త ఆత్రుతగా ఎదురుచూసే ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు పెద్ద ఎత్తున నిర్వహించే మహానాడు కోసమే. గతంలో ఉన్న పరిస్థితులకు భిన్నం గా ఈ మధ్యనే పార్టీ పరంగా సంస్థాగతంగా కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. ఈ ప్రక్రియను వచ్చే నెల 15లోపే పూర్తి చేసే దిశగా కార్యాచరణ ప్రకటించారు.ఆ దిశగా వేగంగా ముందుకు కదలాల్సిందిగా సూచన చేశారు. పార్టీ అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం జరగనున్న మహానాడు అత్యంత కీలకం కానుంది. అయితే ఓటర్లలో పార్టీ పరంగా మరింత ఇమిడి ఉండేలా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతీ 60 మంది ఓటర్ల నుంచి ఒక మహిళ, మరో పురుషుడు చొప్పున ఇద్దర్ని కుటుంబ సాధికార సారథు లుగా (కేఎస్‌ఎస్) గుర్తిం చాల్సి ఉంది. పార్టీ పరంగా అధ్యక్షుడి దగ్గర నుంచి దిగువ స్థాయి కార్యకర్త వరకు ఎట్టి పరిస్థితుల్లోను కుటుంబ సాధికార సారఽథులుగా ఉండి తీరా ల్సిందే. ఈ ప్రక్రియ యావత్తును ఈ నెల 20వ తేదీ నాటికే పూర్తి చేయాల్సి ఉంది. తొలిసారి ఈ దిశగా అడుగులు వేస్తుండ టం తో క్షేత్రస్థాయిలో కొంత గందరగోళం ఏర్పడిం ది. నియోజకవర్గాల్లో ఇప్పటికీ పార్టీ ఆదే శాల ప్రకారం కుటుంబ సాధికార సారఽథు లుగా పూర్తి స్థాయిలో నియమించలేని పరి స్థితి. తాజా సమాచారం ప్రకా రం కైకలూరు, పోలవరం పరిధిలో ఇంకా పూర్తిగా వెనుక బడి ఉన్నారు. మంత్రి పార్థసారఽథి ప్రాతి నిథ్యం వహిస్తున్న నూజి వీడు నియోజక వర్గంలో మొత్తం కుటుంబ సాధికార సారఽథు లుగా (కేఎస్‌ఎస్) గుర్తించాల్సి ఉన్నప్పటికీ ఇంకా 10 శాతం పైగానే ఎంపిక చేయాల్సి ఉంది. ఏలూరు నియోజకర్గంలో ఎమ్మెల్యే బడేటి చంటి చొరవ తీసుకున్నారు. నూటికి నూరు శాతం కేఎస్‌ఎస్‌ను ఎంపిక చేసి అగ్రస్థానంలో నిలిచారు. జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ప్రాతినిథ్యం వహి స్తున్న ఉంగుటూరు నియోజవర్గంలో ఇప్పటి వరకు 7వేలకు పైగా కేఎస్‌ఎస్‌లకుగాను సుమారు 4వేల మందిని మాత్రమే ఎంపిక చేయగలిగారు. ఈ నియోజకవర్గంలో మరో 40 శాతం మేర ఎంపిక చేయాలి. చింతల పూడి నియోజకవర్గంలో సుమారు 9వేల మందికి గాను ఇప్పటికే 75 శాతం మేర ఎంపిక చేయగలిగారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రాతినిఽఽఽథ్యం వహిస్తున్న దెందు లూరు నియోజక వర్గంలో కాస్త దూకుడుగానే ఉన్నారు. ఇప్పటికే 7,712 కేఎస్‌ఎస్‌లకు 6,606 పైగానే ఎంపిక పూర్తి చేసి 89శాతం మేర లక్ష్యాలను అందుకోగలిగారు. ఇక కైక లూరు, పోలవరం నియోజకవర్గాల్లో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా సమా చారం క్రోఢీకరిస్తున్నారు.
జూ క్షేత్రస్థాయిలో కానరాని దూకుడు
తెలుగుదేశం పార్టీ పరంగా పిలుపునిస్తే చాలు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నేతల్లో భారీ స్పందన కనిపించేది. ప్రతీ మహానాడులోను తమ ఇంటి పండుగగా భావించి ఉత్సాహంగా కార్యరంగంలోకి దిగేవారు. జిల్లాల వారీగా పోటీ పడేవారు. అధినేత చంద్రబాబు దృష్టిలో పడేందుకు విశ్వ ప్రయత్నం చేసేవారు. కానీ ఈ సారి పార్టీ అధికారంలో ఉన్నా సంస్థాగత ఎన్నికల నిర్వహణలో పార్టీలో కొంత నిర్లిప్తతే కనిపిస్తోంది. సుమారు మూడు వారాల క్రితమే సంస్థాగత ఎన్నికల తేదీలను ప్రకటించినా క్షేత్రస్థాయిలో ఇంకా మంద కొడిగానే వ్యవహారం సాగుతోంది. పార్టీలో యువతరంతో పాటు మిగతా వర్గాలకు అత్యంత ప్రాధాన్యత కల్పించే దిశ గానే మార్పులు, చేర్పులు చేసి కొత్త కుటుంబ సాధికార సారథులను తెరముందుంచారు. బూత్ దగ్గర నుంచి లోక్‌సభ నియోజకవర్గం కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఈ కారణంగా పార్టీలో అత్యధిక పదవులను పొందేలా, కార్యకర్త లను మరింత ప్రోత్సహించేలా చేయాలని తలపెట్టారు. ఇప్ప టికే ఈనెల 20 నాటికి కుటుంబ సాధికార సారఽథులు ఎంపిక పూర్తి కావాల్సి ఉంది. జిల్లాలో ఒక్క ఏలూరు మినహా, మిగతా నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తి చేయలేక పోయారు. కీలకమైన బూత్, గ్రామ కమిటీల నియామకాన్ని ఈ నెల 22న పూర్తి చేయాలని భావించినా, ఆ దిశగా ఇప్పటికీ ముందుకు సాగలేదు. ఇంతకుముందు పార్టీ పదవుల వైపే అత్యధికులు మొగ్గు చూపేవారు. శాసనసభ, పార్లమెంట్ నియోజకవర్గాల కమిటీల్లోను ఆసక్తి ప్రదర్శించేవారు. కానీ ఈ సారి మాత్రం క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. మరో పక్షం రోజులే గడువు ఉండగా సంస్థాగత ఎన్నికలు, నియామకాల్లో తొలి అడుగు పూర్తిగా వేయలేని పరిస్థితి. తెలుగుదేశం పరంగా ఆది నుంచి ఏకపక్షంగా జిల్లా నాయకత్వం దగ్గరుండీ ఈ వ్యవహారం పర్యవేక్షించేది. అయితే ఈసారి కొన్ని నియోజకవర్గాల్లో జనసేన, బిజేపీలు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆ ప్రభావం టీడీపీ సంస్థాగతంపై పడింది. కనీసం గడువు పొడిగించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో మిగతా కమిటీ ఎన్నికల సకాలంలో పూర్తి చేయడం దుర్లభంగా ఉందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.