అమ్మో.. మిర్చా!
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:57 AM
ఏజె న్సీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు నాణ్యమైన మిర్చి పంటకు ప్రసిద్ధి.

వరుస నష్టాలు.. పెట్టుబడులు రాని వైనం
గతంలో పదివేల ఎకరాల్లో సాగు.. నేడు వెయ్యి ఎకరాల్లోపే..
ప్రత్యామ్నాయంగా జామాయిల్, అరటి సాగుకు మొగ్గు
కుక్కునూరు, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ఏజె న్సీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు నాణ్యమైన మిర్చి పంటకు ప్రసిద్ధి. ఇక్కడ పండే మిర్చి మార్కెట్‌లోకి వెళ్తే కనీసంగా రూ.500 నుంచి రూ.1000 అదనంగా వ్యాపారులు చెల్లిం చేవారు.మంచి దిగుబడి, ఆశాజనకంగా ధర, మిర్చి రైతాంగానికి లాభసాటిగా ఉండేది. నేడు పరిస్థితులు మారాయి. ఒకప్పుడు
దాదాపుగా పదివేల ఎకరాలకు పైగా మిర్చిని సాగు చేసేవారు. ప్రకృతి వైపరీత్యాలు, వాతా వరణం అనుకూలించకపోవడం, పంటపై వైరస్ దాడులు, పెరిగిన పెట్టుబడి, గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు. దీంతో మిర్చిసాగు అంటేనే రైతులు వెనుకంజ వేస్తు న్నారు. ఈ ఏడాది రెండు మండ లాల్లో వెయ్యి ఎకరాలలోపే మిర్చిసాగు జరిగే పరిస్థితి. ప్రత్యామ్నాయంగా జామా యిల్, అరటి, మొక్క జొన్న పంటలపై దృష్టి పెడు తున్నారు.
అప్పుల ఊబిలో..
క్వింటా మిర్చి ధర 2020, 2021, 2022 సంవత్సరాల్లో రూ.15 వేలు నుంచి రూ.23 వేల వరకు పలకడంతో కొంత వరకు లాభార్జించారు. ఈ క్రమంలో అధికశాతం రైతులు మిర్చిసాగు వైపు ఆసక్తి చూపడంతో ఎకరం పొలం కౌలు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు పెరిగింది. మరో వైపు పెట్టుబడులు పెరిగాయి. పంటపై నల్లి అనే వైరస్ దాడి, అతివృష్టి కారణంగా దిగుబడు లు తగ్గాయి. ఒకప్పుడు ఎకరానికి 30 క్వింటాళ్లు దిగుబడి రాగా గత రెండేళ్లుగా 20 క్వింటాళ్ల లోపే దిగుబడి వస్తోంది. దీనికి తోడు రెండేళ్లుగా ధర పతనమైంది. క్వింటా మిర్చి రూ.15 వేల నుంచి రూ.ఏడు వేలకు పడిపోయింది. కోత కూలీల ఖర్చు రాని పరిస్థితి నెలకొంది. గతేడాది 90 శాతం రైతులకు ఎకరానికి రూ.రెండు లక్షల కు పైగా నష్ట రావడంతో ఈ ఏడాది మిర్చి సాగుకు అమడదూరంలో ఉన్నారు.
ప్రత్యామ్నాయంగా జామాయిల్, అరటి
మిర్చి సాగుతో నష్టపోతున్న రైతాంగం ప్రత్యామ్నాయ పంటల వైపు చూస్తున్నారు. ఈ ఏడాది 90 శాతం జామాయిల్ సాగు చేస్తున్నా రు. జామాయిల్ టన్ను ధర రూ.ఏడు వేల నుంచి రూ.7,500 వరకు పలుకుతోంది. తక్కువ శ్రమ, పెట్టుబడి, నికర లాభం వస్తుందనే ఆలో చనతో ఈ పంటవైపు ఆసక్తి చూపుతున్నారు. అరటి, మొక్కజొన్నపైనా దృష్టి పెట్టారు. చీర వల్లి, మాధ వరం, దామర చర్ల, ముత్యాల మ్మ పాడు, తది తర గ్రామాల్లో దాదాపు 200 ఎకరాల్లో అరటిని సాగు చేస్తున్నారు.