Share News

అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించండి

ABN , Publish Date - Apr 29 , 2025 | 12:41 AM

అర్జీదారుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నాగరాణి అధికారులను ఆదేశించారు.

అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించండి
అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగరాణి

అధికారులకు కలెక్టర్‌ నాగరాణి ఆదేశం

భీమవరంటౌన్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): అర్జీదారుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరి ష్కార వేదిక కార్యక్రమంలో 246 అర్జీలను స్వీకరించారు. మం డలస్థాయి అధికారులతో చర్చించాలని, సంబంధిత శాఖకు అప్పగించాలని సూచించారు. ఎక్కువ ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్న శాఖలకు ఈనెల 30న వర్క్‌షాప్‌ నిర్వహిస్తామన్నారు. వచ్చిన ఫిర్యాదులలో కొన్ని..

తాడేపల్లిగూడెంకు చెందిన తోపు సాయి కిశోర్‌ పుట్టుకతో వెన్నెముక, కిడ్నీ సమస్యల బాధపడుతున్నానని, రూ.6 వేల పింఛన్‌తో జీవనం సాగిస్తున్నానన్నారు. రూ.15వేల పింఛన్‌ మంజూరు చేయాలని కోరారు.

భీమవరం పట్టణం గునుపూడికి చెందిన నాగేశ్వరరావు (68) రూ.15వేల పింఛన్‌ మంజూరు చేయాలని కోరారు.

తన మనవడు ఇంటి స్థలాన్ని ఆక్రమించుకొని కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నాడని, ఆ స్థలం తన కూతురికి చెందేలా చేయాలని ఇరగవరం మండలం యర్రాయిచెరువు గ్రామానికి చెందిన జుత్తిగ సరస్వతి (85) కోరారు.

ఇరగవరం మండలం కావలిపురంలో పంచాయతీ స్వీపర్‌గా 2014 జూన్‌లో ఉద్యోగ విరమణ చేశానని, జిల్లా పరిషత్‌ పింఛన్‌ జిల్లాల విభజన అనంతరం నిలిచిపోయిందని, పింఛన్‌ అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో జేసీ టి.రాహుల్‌ కుమార్‌రెడ్డి, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి.శివన్నారాయణ రెడ్డి, సచివాలయాల అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్‌.అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్డు వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం

ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి

భీమవరం క్రైం: ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని, అర్జీలు పునరావృతం కాకుండా పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి పోలీసులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రీడ్రసెల్‌ సిస్టమ్‌) కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ప్రజల నుంచి ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించారు. విచారణ జరిపి పరిష్కరిస్తామని భరోసానిచ్చారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని సూచించారు.

Updated Date - Apr 29 , 2025 | 12:41 AM