పునరుత్తేజం
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:47 AM
రాష్ట్రంలో మైనింగ్ రంగానికి పునరుత్తేజం తీసుకొచ్చేలా ప్రభుత్వం మైనర్ మినరల్ పాలసీ అమలుకు శ్రీకారం చుట్టింది. దీనికి అనుగుణంగా జిల్లాలో గనులు లీజులను ఆన్‌లైన్ పద్ధతిలో జారీకి ఏర్పాట్లు జరుగు తున్నాయి.

పారదర్శకంగా మైనింగ్ మినరల్ పాలసీ
సింగిల్ విండో కింద త్వరలో అనుమతులు
ఆన్‌లైన్‌లో లీజులకు 16 దరఖాస్తులు
28 పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కల్పించేందుకు చర్యలు
రాష్ట్రంలో మైనింగ్ రంగానికి పునరుత్తేజం తీసుకొచ్చేలా ప్రభుత్వం మైనర్ మినరల్ పాలసీ అమలుకు శ్రీకారం చుట్టింది. దీనికి అనుగుణంగా జిల్లాలో గనులు లీజులను ఆన్‌లైన్ పద్ధతిలో జారీకి ఏర్పాట్లు జరుగు తున్నాయి. తద్వారా గనుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పక్కాగా జమ అయ్యేలా ప్రభుత్వం నడుంబిగించింది. జూలై 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ దర ఖాస్తులను స్వీకరించారు. వీటికి త్వరలో సింగిల్‌విండో కింద అధికారులు అను మతులు జారీ చేస్తారు. ఇప్పటి వరకు జిల్లాలో 16 దరఖాస్తులు అందాయి.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ప్రధానంగా గ్రావెల్, రోడ్డుమెటల్, లైమ్ స్టోన్, బాల్‌క్లే తదితరాలకు దరఖాస్తులను స్వీకరిం చారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్దేశ పూర్వకం గానే కొందరి దరఖాస్తులను పెండింగ్‌లో ఉం చేసింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి పెండింగ్ ఉన్న వాటిని పరిష్కరించేందుకు నడుం బిగించింది. దీంతో ఎక్కువ మందికి లీజులు పొందే అవకాశాలకు మార్గం సుగమం చేసింది. 2022 మార్చి 13 నాటికి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నీ పరిగణనలోకి తీసుకుని లీజులు కేటాయిస్తారు. ఇప్పటికీ ఆ లీజు ప్రాంతం ఖాళీగా ఉండి ఎవరికి మంజూరు చేయకుండా ఉంటే.. వాటిని పాత దర ఖాస్తుదారులకు కేటాయిస్తారు. అప్పటికి దరఖాస్తు ఫీజు, డిపాజిట్ చెల్లించిన వారికే ఈ అవకాశం ఇస్తారు. వార్షిక డెడ్ రెంట్ విలువకు మూడు రెట్లు మొత్తంలో మూడు నెలల్లో ఒక విడత సొమ్ము చెల్లించాలి. తర్వాత ఎన్‌వోసీ తెచ్చుకుంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌వోఐ)లు ఇచ్చి అన్నీ అనుమతు లు పొందేందుకు ఏడాది గడువు ఇస్తారు. మైనింగ్ ప్లాన్, పర్యావరణ అనుమతులు, సీఎఫ్‌ఈ అంద జేసి ఉంటే.. వాటిని లీజుల మంజూరుకు పరిగణ నలోకి తీసుకుంటారు. గనులశాఖ అధికారులు అనుమతి లేకుండా లీజులను బదిలీ చేయకూడదు. లీజు బదిలీ కోసం దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించాలి.
సీనరేజ్ కాంట్రాక్ట్‌కు త్వరలో చర్యలు
జిల్లా పరిఽధిలో గనుల తవ్వకాలకు సంబంధించి భూగర్భ గనులశాఖ ఆధ్వర్యంలోనే ఇక అనుమతులు ఇవ్వన్నారు. వైసీపీ హయాంలో వీటికి సంబంధించి సీనరేజ్ వసూళ్ల బాధ్యత సుధాకర్ ఇన్‌ఫ్రాకు ఇచ్చి రెండేళ్లకు సీనరేజ్ వసూళ్లను చేయించారు.ఆ గడువు కాస్త ముగిసింది. దీంతో త్వరలోనే టెండర్లు లేదా బహిరంగ వేలం విధానంలో సీనరేజ్ వసూళ్ల కాంట్రాక్టును అప్పగించనున్నారు. లీజులు, సీనరేజ్ కాంట్రాక్టు కేటాయింపులపై జిల్లా గనులశాఖ ఇన్‌చార్జి డిప్యూటీ డైరక్టర్ కిశోర్ బాపూజీ మాట్లాడుతూ మైనింగ్ పాలసీ ద్వారా జిల్లాలో ఆదాయం పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి పర్యావరణ, అన్ని అనుమతులు పరిశీలించి లీజులను కేటాయిస్తామన్నారు. సీనరేజ్ కాంట్రాక్టు కేటాయింపు విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
ఐదు రెట్ల ప్రీమియంతో లీజుల పునరుద్ధరణ
వార్షిక్ డెడ్‌రెంట్ విలువకు ఐదు రెట్ల మేర ప్రీమియం మొత్తంగా చెల్లిస్తే లీజులను పునరుద్ధరి స్తారు. అది కూడా రెండు, మూడు వాయిదాల్లో చెల్లించవచ్చు. లైమ్‌స్టోన్ స్లాబ్‌లకు జిల్లాల వారీగా సీనరేజ్ వసూళ్లకు, కాంట్రాక్టర్లు ఎంపికకు ఐదేళ్ల గనుల శాఖ రాబడిని పరిశీలించి బేస్ ధర నిర్ణయి స్తారు. రెండేళ్ల కాలానికి కాంట్రాక్టర్ కు వసూళ్లకు అవకాశం ఇచ్చారు. రిజర్వ్ ధరలో 2.5 శాతం మేర కాంట్రాక్టరు బ్యాంకు గ్యారంటీగా జమ చేయాలి.