విధేయత, విశ్వసనీయతకు పెద్దపీట
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:44 AM
భారతీయ జనతా పార్టీలో అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుడు పాకా వెంకట సత్యనారాయణ. రాష్ర్టీయ స్వయం సేవక్ సంఘ్ భావజాలంతో అడుగులు వేసి బీజేపీలో చేరారు.

రాష్ట్రం నుంచి రాజ్యసభకు బీజేపీ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ
ఆ పార్టీ ఏపీ కోర్ కమిటీ నిర్ణయం
నేడు నామినేషన్ దాఖలు
45 ఏళ్లుగా పార్టీకి విశేష సేవలు
జిల్లాకు బీజేపీ మరింత ప్రాధాన్యం
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
భారతీయ జనతా పార్టీలో అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుడు పాకా వెంకట సత్యనారాయణ. రాష్ర్టీయ స్వయం సేవక్ సంఘ్ భావజాలంతో అడుగులు వేసి బీజేపీలో చేరారు. రాష్ట్రస్థాయిలో ఎన్నో కీలక పదవు లు నిర్వహించారు. ప్రతిసారీ చట్టసభల్లో పదవులు ఆయ న తలుపు తట్టినా ఎన్నికలంటే వ్యయంతో కూడు కోవ డంతో అదృష్టం వరించలేదు. పార్టీకి విశ్వసనీయ సేవలం దించడం పాకా వెంకట సత్యనారాయణకు కలసి వచ్చింది. దశాబ్దాలపాటు పార్టీకోసం చేసిన సేవలకు గుర్తింపు లభించింది. రాజ్యసభ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారా యణను ఏపీ కోర్ కమిటీ ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఆయన ఎన్నిక కానున్నారు. రాజ్యసభ ఉప ఎన్నికలకు మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. అదే రోజు పాకా సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో పాకా తన ప్రస్థా నాన్ని ప్రారంభించారు. విద్యార్థి దశలో భారతీయ విద్యార్థి పరిషత్‌లో కీలకంగా వ్యవహరించారు. అప్పటి నుంచి బీజేపీ భావజాలంతో రాజకీయంగా అడుగులు వేశారు. పాకా 1976లో ఆర్‌ఎస్‌ఎస్‌లో, 1980లో బీజేపీ క్రియాశీల సభ్యునిగా సేవలందించారు. అప్పటినుంచి క్షేత్ర స్థాయిలో పదవులు చేపడుతూనే రాజకీయ విశ్లేషణల్లో ఆరితేరారు. న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ బీజేపీలో అంకితభా వంతో పనిచేస్తున్నారు. 45 ఏళ్ల నుంచి ఆయన పార్టీకి విశే ష సేవలందిస్తూ వస్తున్నారు. కేంద్రంలో పార్టీ అధికారం లో ఉన్నా ఆయనకు ప్రభుత్వ పదవులు రాలేదు. అయిన ప్పటికీ పార్టీపై విశ్వసనీయతతో పార్టీ సిద్ధాంతాలను ప్రజ ల్లోకి తీసుకువెళ్లడంలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ వచ్చా రు. గడచిన పార్లమెంట్ ఎన్నికల్లో నరసాపురం పార్లమెం ట్ సీటును కూటమి తరపున కేటాయించేందుకు పాకా సత్యనారాయణ పేరు తెరపైకి వచ్చింది. అప్పట్లో భూపతి రాజు శ్రీనివాసవర్మ టిక్కెట్‌ను దక్కించుకున్నారు. ఇలా ఎన్నోసార్లు పాకా అవకాశాలను కోల్పోయారు. కేంద్ర నా యకత్వం ఆశీస్సులతో రాష్ట్ర కోర్ కమిటీ రాజ్యసభ అభ్యర్థి గా ఎంపిక చేసింది. ఎన్నిక లాంఛనప్రాయం కానుంది. కూటమిలో బీజేపీ తరపున పాకా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం ఆయన బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.