Share News

పోలవరంలో లీకేజీ సెగ

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:34 AM

పోలవరం ఎస్టీ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా ఆయన అవినీతికి పాల్పడుతున్నారంటూ సోషల్‌ మీడి యాలో హోరెత్తిస్తున్నారు.

 పోలవరంలో   లీకేజీ సెగ

దేవినేని ఉమా, కరాటం రాంబాబు సంభాషణ లీక్‌

కూటమిలో కలవరం.. దుమారం

ఎమ్మెల్యేపై తరచూ అవినీతి ప్రచారం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

పోలవరం ఎస్టీ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా ఆయన అవినీతికి పాల్పడుతున్నారంటూ సోషల్‌ మీడి యాలో హోరెత్తిస్తున్నారు. ఈ మధ్యనే మరో దుమారంలో చిక్కుకున్నారు. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా, ఉమ్మడి పశ్చిమ గోదావరి రాజకీయ దిగ్గజం, జనసేన నేత కరాటం రాంబాబు మధ్య సాగిన ఫోన్‌ సంభాషణ కాస్త లీకైంది. ఎమ్మెల్యే బాలరాజు అవినీతిపై జరిగిన ఈ సంభాషణ యావత్తు కావాలనే లీక్‌ చేశారా, చేస్తే ఎవరు చేశారు, ఏమి ఆశించి చేశారు, అంతర్గతంగా ఎమ్మెల్యే ను ఇరకాటంలో పెట్టేందుకే సీనియర్ల ప్రమే యం లేకుండా ఏకపక్షంగా లీకేజి ఎలా చేయ గలిగారు అనే ప్రశ్నలే తలెత్తుతున్నాయి. భారీఎత్తున వెనకేసుకున్నట్లు ఈ సంభాషణల సారాంశం కాగా, ఇంకోవైపు జనసేన ఎమ్మెల్యేలే ఏడాదిలోపే ఈ స్థాయికి దిగజారి పోయారంటూ సాగిన ఫోన్‌ లీకేజీలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి.

జూదంపై ప్రచారం

ఎమ్మెల్యే ఆశీస్సులతో నియోజకవర్గంలో ఇటీవల పెద్ద ఎత్తున జూదం సాగుతోందని, రోజుకు లక్షలాది రూపాయలు చేతులు మారు తున్నాయంటూ యూట్యూబ్‌ల్లో ప్రచారం సాగింది. ఈ దందాను ఆపాల్సింది పోయి ఎమ్మెల్యే రోజువారీ మామూళ్లను వెనకేసుకుం టున్నారంటూ ఓ యూ ట్యూబర్‌ ప్రచారం చేశాడు. దీంతో ఎమ్మెల్యే బాలరాజు జిల్లా ఎస్పీ కిశోర్‌ను కలిసి రాజకీయంగా తనను ఇబ్బంది పాలు చేసేందుకే ఆ యూట్యూబ్‌ పత్రిక ఏ రకంగా విష ప్రచారం చేసిందో ఆధారాలతో సహా ఆయన ముందుంచారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలుగా తాము ప్రజలకు సేవ చేయాలా, లేకుంటే ప్రతీవారు వేసే బురదను కడుక్కుంటూ కూర్చోవాలా అంటూ బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తనపై విష ప్రచారం చేస్తున్న ఆ యూట్యూబర్‌పై ఫిర్యాదు చేయడం, దీనికి అనుగుణంగా ఆ వ్యక్తిని అరెస్టు చేయడం చకచకా జరిగిపో యాయి. ఎవరుబడితే వారు తనపై దుష్ప్రచా రానికి దిగితే చట్టపరమైన చర్యలు తీసుకుం టానంటూ ఎమ్మెల్యే హెచ్చరించారు.

ఎందుకిలా జరుగుతోంది ?

పోలవరం నియోజకవర్గంలో గతంలో పని చేసిన ఎమ్మెల్యేలపైన కొన్ని ఆరోపణలున్నాయి. కానీ వీటిని ఊరూ, వాడా ప్రచారం చేయ లేదు. ఇప్పుడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాలరాజు వ్యవహారంలో మాత్రం కూటమిలోనే కొందరు కావాలనే అగ్గి రాజేస్తున్నట్టు భావిస్తున్నారు. ఆ నేతలు జనసేన పక్షమా? లేకుంటే కూటమి భాగస్వామ్య పక్షాల్లో మరెవరిదైనా హస్తం ఉందా అనే ప్రశ్న తలెత్తినప్పుడు వివాదం ము దురుతూ వస్తోంది. ఈ మధ్య కాలంలో పోల వరం మార్కెట్‌ కమిటీ విషయంలోనూ జరిగి న ప్రచారాన్ని జనసేన నేతలు గుర్తుచే స్తు న్నారు. ప్రత్యేకించి టీడీపీకి చెందిన కొందరు అంతా తమదేననే విధంగా వ్యవహరించిన తీరును తప్పు పడుతున్నారు. గతంలో తనపై ఆరోపణలు వచ్చినప్పుడు జరిగిన వాస్తవాలను పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, సీనియర్‌ నేత మంత్రి నాదెండ్ల మనోహర్‌ దృష్టికి తీసుకెళ్లా రు. ఈసారి వచ్చిన ఆరోపణలు, జరిగిన ప్రచారాన్ని సైతం అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు.

Updated Date - Aug 03 , 2025 | 12:35 AM