కాళీపట్నం భూ సమస్య పరిష్కరిస్తాం
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:37 AM
దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న కాళీపట్నం జమిందారీ భూసమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు.

జాయింట్ కలెక్టర్ రాహుల్‌కుమార్ రెడ్డి
మొగల్తూరు, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న కాళీపట్నం జమిందారీ భూసమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. కాళీపట్నం రెవెన్యూ గ్రామాల భూసమస్యపై జగన్నాధపురంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు. 1945 నాటికి ఈ భూముల పై హక్కులతో సాగు చేసుకున్న రైతులకు శాశ్వత భూహక్కు పట్టాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రైతులు మాట్లాడుతూ భూహక్కు లేకపోవడంతో ఆర్థిక పరపతి లభించక, రిజిస్ట్రేషన్లు జరగక తీవ్రంగా నష్ట పోతున్నామన్నారు. 1945 కటాఫ్ తేదీని మార్చి ప్రస్తుత తేదీన సాగు చేసుకుంటున్న ప్రతీ రైతుకు వివాదంలో లేని భూములపై హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవా లని కోరారు. 2025 నాటికి సాగు చేసుకుంటున్న రైతు లకు హక్కు కల్పించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసు కువెళతామని జేసీ తెలిపారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ ప్రతీ రైతుకు భూ హక్కు కల్పించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, ఆర్డీవో దాసి రాజు, తహసీల్దార్ రాజ్ కిశోర్, జడ్పీటీసీ తిరుమాని బాపూజీ, పాతపాడు, కాళీపట్నం తూర్పు, పడమర, కోమటితిప్ప, జగన్నాధపురం గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, రైతు సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.