తప్పు దిద్దుబాటు!
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:26 AM
ఫారెస్టు అధి కారులు చేసిన తప్పును సరిచేసుకునే ప్రయత్నం చేస్తు న్నారు. నిడమర్రు మండ లం పెదనిండ్రకొలను – నిడ మర్రు శివారు కొల్లేరు సరి హద్దు ప్రాంతంలో 16 ఎక రాల విస్తీర్ణంలోని రెండు చేపల చెరువులను కొల్లేరు సరస్సు భూమి ఉందంటూ శనివారం ఫారెస్టు అధికారులు గండ్లు కొట్టడంతో ఆ నీరంతా దిగువన ఉన్న వరిచేలను ముం చిన విషయం విదితమే.

ఆంధ్రజ్యోతి కథనంతో కదిలిన యంత్రాంగం
నీట మునిగిన వరిపొలాల నుంచి ముంపు నీటిని బయటకు మళ్లించే ప్రయత్నాలు
ముంపునకు గురైన పొలాలను పరిశీలించిన రెవెన్యూ, వ్యవసాయ సిబ్బంది
ఫారెస్టు అధికారులపై బాధిత వరి రైతుల ఫిర్యాదు
నేడు కొల్లేరు తీరంలో సరిహద్దుల సర్వే
నిడమర్రు, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి) : ఫారెస్టు అధి కారులు చేసిన తప్పును సరిచేసుకునే ప్రయత్నం చేస్తు న్నారు. నిడమర్రు మండ లం పెదనిండ్రకొలను – నిడ మర్రు శివారు కొల్లేరు సరి హద్దు ప్రాంతంలో 16 ఎక రాల విస్తీర్ణంలోని రెండు చేపల చెరువులను కొల్లేరు సరస్సు భూమి ఉందంటూ శనివారం ఫారెస్టు అధికారులు గండ్లు కొట్టడంతో ఆ నీరంతా దిగువన ఉన్న వరిచేలను ముం చిన విషయం విదితమే. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ వచ్చిన కథ నంతో అధికార యంత్రాంగంలో కదిలిక వచ్చింది. రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులు సోమవారం ఉదయం ముంపునకు గురైన వరి పొలాలను పరిశీలించారు. మరో వైపు ఫారెస్టు అఽధికారులు, ఫీల్డ్ సిబ్బంది ఇంజన్ల సాయంతో ఆదివారం రాత్రి నుంచే నీరు బయటకు తోడే ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారు 15 మంది సిబ్బం దితో కలసి రేంజ్ ఆఫీసర్ మోహినీ విజయ లక్ష్మీ, సెక్షన్ ఆఫీసర్ గంగారత్నం దగ్గరుండి పర్యవేక్షించారు. మరలా సోమ వారం ఉదయం ఎక్స్‌కవేటర్‌ను తీసుకొచ్చి వరిచేలో నీరు బయటకు పోయేలా మార్గాన్ని ఏర్పాటు చేశారు. సాయం త్రానికి చేలో చాలా వరకు నీరు తగ్గుముఖం పట్టింది. కాగా రెవెన్యూ సిబ్బంది సోమవారం వ్యవసాయ శాఖాధికారులను వెంట తీసుకొని వెళ్లి వరిపంట నష్టం అంచనా వేయడానికి ప్రయత్నించారు. అయితే వరిచేలే ఇంకా నీరు ఉండడంతో కోత సాధ్యపడదనే నిర్ణయానికి వచ్చారు. నీరు పూర్తిగా తోడిన తర్వాత మరో వారానికి గాని నేల ఆరదని నిర్ణయానికి వచ్చారు. అప్పుడే కోతకోసి ఆ తర్వాతే రైతులకు ఎంతమేరకు నష్టం వాటిల్లుతుందో అంచనా వేయగలమని ఉన్నతాధికారులకు నివేదించినట్టు తహసీల్దార్ నాగరాజు తెలిపారు.
నేడు కొల్లేరు అభయారణ్యంలో సరిహద్దు సర్వే
కొల్లేరు అభయారణ్యం పరిధిలోని సరస్సు సరిహద్దుతో పాటు భీమడోలు, నిడమర్రు మండలాల సరిహద్దులు అంచనా వేయడానికి సర్వే చేస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. రైతులు చేసుకున్న సర్వే దరఖాస్తు ఆధారంగా మంగళవారం సర్వే చేస్తామన్నారు. ఈ సర్వేలో భీమడోలు, నిడమర్రు మండలాల సరిహద్దులు కూడా అంచనా వేసి నిర్ధారిస్తామని తెలిపారు.
ఫారెస్టు అధికారులపై ఫిర్యాదు
ఇదిలా ఉండగా పంటకు వచ్చిన తమ వరిచేలను ఫారెస్టు అధికారులు నిర్లక్ష్యంతో నాశనం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ నిడమర్రు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమకు చెందిన 7.50 ఎకరాల పంట మొత్తం విలువ సుమారు రూ.8.50 లక్షలను తమకు నష్టపరిహారంగా చెల్లిం చాలని బాధిత రైతులు చెన్నుబోయిన సుబ్బాయమ్మ, చెన్నుబోయిన వెంకన్న డిమాండ్ చేశారు. దీనిపై ఎస్‌ఐ వీరప్రసాద్ మాట్లాడుతూ రైతుల ఫిర్యాదును పరిశీలించి విచారణ చేస్తున్నామన్నారు.