ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పనిచేయని మార్చురీ ఫ్రీజర్ బాక్సులు
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:35 AM
జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి నిత్యం వివిధ రకాల మృతదేహలు మార్చురీకి వస్తూ ఉంటా యి.

మృతదేహాలను భద్రపరచాలంటే ప్రైవేటు ఫ్రీజర్ బాక్సు తెచ్చుకోవాల్సిందే
ఇప్పటికే ఆసుపత్రిలో సేవలు, సౌకర్యాలు అంతంత మాత్రమే
ఇప్పుడు మార్చురీ పరిస్థితీ అధ్వానం
పట్టించుకోని అధికారులు
ఏలూరు క్రైం, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి నిత్యం వివిధ రకాల మృతదేహలు మార్చురీకి వస్తూ ఉంటా యి. కొన్ని మెడికో లీగల్ కేసులకు సంబం ధించి పోస్టుమార్టం నిమిత్తం రాగా మరికొన్ని నాన్‌ఎమ్మెల్సీకి సంబంధించినవి మృత దేహాలు భద్రపర్చడానికి మార్చురీకి వస్తూ ఉంటాయి. రైల్వే మృత దేహాలు, గుర్తు తెలియని మృత దేహాలను మార్చురీలో భద్రపరుస్తూ ఉంటా రు. నిత్యం ఐదు, ఆరు మృత దేహాలు మార్చు రీలో ఉంటూనే ఉంటాయి. ఈ నేపఽథ్యంలో ఇక్కడ మృత దేహాలను భద్రపరిచేందుకు డీప్ ఫ్రీజర్లను ఏర్పాటు చేశారు. మృతదేహాలు ఎక్కువగా ఉండడంతో ఆరు బాక్సుల నుంచి పన్నెండు బాక్సులకు పెంచారు. రెండు బాక్సు లు కలిపి ఒక యూనిట్ ఫ్రీజర్ బాక్సుగా ఉం టుంది. ఇలాంటివి ప్రస్తుతం ఆరు ఉన్నాయి.
సర్వీసింగ్ ఊసే లేదు
వేసవి కావడంతో ఒక్కొక్కటి పాడవుతూ ఉ న్నాయి. సాధారణంగా వాటి వినియోగం రోజూ ఉండడంతో ఎప్పటికప్పుడు సర్వీ సింగ్‌లు చేయించాల్సి ఉంది. సర్వీసింగ్ చేయించకపోవడంతో మరమ్మతులు జరిగి నప్పుడు మాత్రమే చేయిస్తున్నారు. ఒకేసారి పది బాక్సులు (ఐదు యూనిట్లు) పాడైపోయా యి. ఒక యూనిట్ మాత్రం తక్కువ కూలింగ్ వస్తుంది. మృతదేహాన్ని భద్రపర్చడం సాధ్యం కాదు. అసలే వేసవి కావడంతో మృత దేహాలు త్వరగా పాడవుతూ ఉంటాయి. రైల్వే మృత దేహాలు, జాతీయ రహదారిలో జరిగే రోడ్డు ప్రమాద మృత దేహాలను ఆసుపత్రి మార్చు రీలో భద్రపరుస్తూ ఉంటారు. బంధువులు రావడానికి రెండు మూడు రోజులు పడుతూ ఉంటాది. ఒకొక్క సమయంలో వారం కూడా పట్టవచ్చు. గుర్తు తెలియని మృత దేహాలను ఐదు రోజులపాటు మార్చురీలో భద్రపర్చి పోస్టుమార్టం జరిపి మున్సిపాల్టీకి అప్ప జెబుతూ ఉంటారు. మున్సిపాల్టీ సిబ్బంది వాటిని తీసుకెళ్లి ఖననం చేస్తూ ఉంటారు. నాన్‌ఎమ్మెల్సీ, అనాధ మృత దేహాలను ఐదు రోజుల పాటు చూసి ఆ తర్వాత ఎవరు రాక పోతే మున్సిపాల్టీకి అప్పజెప్తూ ఉంటారు. ఈ నెల 26న ఏలూరు నగరంలో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన యువకుడి మృతదేహాన్ని భద్ర పర్చడానికి సాధ్యపడకపోవడంతో బంధువులు ప్రైవేటుగా ఫ్రీజర్ బాక్సు తెచ్చుకుని మృత దేహం పాడవకుండా దానిలో భద్రపర్చు కున్నారు. మృత దేహాల బంధువులు ఉన్న ప్పుడు వారు ఇలాంటి ఫ్రీజర్ బాక్సును ఏర్పా టు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ రైళ్ళల్లో ప్రయాణిస్తూ జారిపడి మృతి చెందిన వారు, జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదా లు జరిగినప్పుడు వారు ఇతర రాష్ట్రాలకు చెందినవారై ఉంటే అలాంటి మృతదేహాలు ఎవరు భద్రపరుస్తారనే ప్రశ్న తలెత్తుతుంది. ఆ మృతదేహాల బంధువులు వచ్చే లోపు అవి కుళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి.
పట్టనట్టుగా అధికారులు..
కొద్ది రోజుల నుంచి మార్చు రీలో ఫ్రీజర్లు పాడైపోయినా అధికారులు తమకు ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక మార్చురీకి సంబంధించి ఫోరెన్సిక్ విభాగం ఉన్నప్పటికీ సకాలంలో సత్వర నివేదికలు ఉన్నతాధికారులకు పంపకపోవడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తుతోందని తెలుస్తుంది. ఎప్పటికప్పుడు పాడైపోయిన వాటిని మెమోల రూపంలో ఆసుపత్రి మెడి కల్ సూపరింటెండెంట్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రి నిధుల నుంచి సొమ్ములను యుద్ధ ప్రాతి పదికన విడుదల చేసి వాటి మరమ్మతులు చేయించుకోవచ్చు. కానీ ఇప్పటి వరకూ ఈ పనిని అధికారులు ప్రారంభించలేదు. ప్రస్తుతం మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు సెలవులో ఉండడంతో ఇన్‌చార్జి మెడికల్ సూపరింటెండెంట్‌గా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సావిత్రి వ్యవహరిస్తున్నారు. అధికారులు తక్షణం మార్చురీపై దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆదివారం రాత్రి మార్చురీలో ఒక గుర్తు తెలియని బిక్షాటకుడి మృత దేహం మాత్రమే ఉండగా దానిని ఒక ప్రైవేటు ఫ్రీజర్ బాక్సులో భద్రపరిచి ఉంచారు. సోమవారం ఏమైనా మృతదేహాలు వస్తే ఎలా భద్రపరు స్తారనేది ప్రశ్నగా మారింది. మెడికల్ కాలేజీ ఏర్పడిన తరువాత ఆసుపత్రి వైద్య విధాన పరిషత్ నుంచి టీచింగ్ ఆసుపత్రిగా రూపొం దిన తరువాత ఆసుపత్రిలో అన్ని విభాగాల్లో సేవలు ప్రజలకు దూరం అయ్యాయని విమ ర్శలు ఇప్పటికే ఉన్నాయి. చివరకు మార్చురీ అధ్వాన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.