అన్నదాతల ఆనందం
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:19 AM
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌లకు సంబంధించి శనివారం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కావడంతో వారి ఇంట ఆనందం నెలకొంది.

సుఖీభవ, పీఎం కిసాన్ సొమ్ములు విడుదల
ఒక్కో రైతు ఖాతాలో ఏడు వేలు చొప్పున జమ
1,03,751 మంది రైతులకు రూ.71.14 కోట్లు
జిల్లావ్యాప్తంగా సభలు.. భారీగా హాజరైన అన్నదాతలు
రైతులకు ఆర్థిక భరోసా : కేంద్ర మంత్రి వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామ, రాష్ట్ర మంత్రి నిమ్మల
భీమవరం రూరల్/ఉండి/పాలకొల్లు అర్బన్, ఆగస్టు 2(ఆంధ్ర జ్యోతి):అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌లకు సంబంధించి శనివారం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కావడంతో వారి ఇంట ఆనందం నెలకొంది. ఈ రెండు పథకాల కింద రైతుకు ఏటా రూ.20 వేలు అందించనున్నారు. ఇందులో భాగంగా తొలివిడత జిల్లాలోని లక్షా మూడు వేల 751 మంది రైతులకు రూ.71 కోట్ల 14 లక్షలు జమ చేశారు. నియోజకవర్గాల వారీగా పథకం ప్రారంభ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. రైతులు ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చాన్నా ళ్ల తర్వాత సాగుకు చేయూత లభించిందని, సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో సాగు చేసేందుకు రైతులు తీవ్ర ఇబ్బందుల కు గురయ్యారు. కూటమి ప్రభుత్వం రావడంతో వీరికి ప్రాధాన్యత ఇస్తోంది. పంటల కొనుగోలు సొమ్ములు గంటల వ్యవధిలోనే వారి ఖాతాల్లో జమ చేయడం, యాంత్రిక పనిముట్ల సబ్సిడీ అందించ డం వంటివి వారికి ఊతమిచ్చాయి.
ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పాత్ర మరువలేం
రైతులకు ఆర్థిక భద్రత, భరోసా కల్పించడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ధ్యేయమని, ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబుల పాత్ర మరువలేనిదని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. శనివారం ఉండి మండలం ఎన్‌ఆర్పీ అగ్రహారం కేవీకేలో ‘అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ మేళా’ కార్యక్రమాలను ప్రారం భించి అర్హులైన రైతులకు చెక్కులను అందించారు. మంత్రి వర్మ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సన్మాన్ నిధి పఽథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించి ప్రతీ రైతు కుటుంబానికి ఏడాదికి 6 వేల ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ మాట్లాడు తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలకు అండగా వుండి ఆదు కుంటాయన్నారు. ఉండి నియోజకవర్గంలో 9,629 మంది రైతుల కు ఆరు కోట్ల 50 లక్షల 45 వేల రూపాయల చెక్కును అందించా రు. ఎంపీ పాకా సత్యనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ భూ ములకు అనుకూలమైన పంటలను పండిస్తూ రైతులు ముందుకు సాగాలని కోరారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి మాట్లాడు తూ రైతులకు ఏమైనా సమస్యలు వుంటే 15521 టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేసి పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. ఆర్డీవో ప్రవీణ్ కుమార్, మార్టేరు శాస్త్రవేత్తలు, ఉండి కేవీకే ప్రోగ్రాం కో ఆర్డినేటర్ మల్లికార్జునరావు, ఇతర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత, సర్పంచ్ సూరవరపు కనకదుర్గ, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకు లు జుత్తుగ నాగరాజు, కరిమెరక నాగరాజు, యడవల్లి వెంకటేశ్వ రరావు, యర్రా విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
వేలాది మందితో మంత్రి డాక్టర్ నిమ్మల ట్రాక్టర్ ర్యాలీ
‘వైసీపీ ఐదేళ్ల పాలనలో రైతులను పట్టించుకోని జగన్‌కు పాలించే అర్హత లేదని గత ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. రైతులకు మేలు జరిగిందంటే.. గత టీడీపీ హయాంలోను, నేడు కూటమి ప్రభుత్వంలోనే. రైతు క్షేమం, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబునాయుడు రైతు పక్షపాతి’ అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో శనివారం జరిగిన సభలో మంత్రి డాక్టర్ నిమ్మల మాట్లాడారు. అన్నదాతలకు సుఖీభవ కింద రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పి.మురళీకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఆర్డీవో దాసి రాజు కూటమి నాయకులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతగా నియోజకవర్గంలోని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు వచ్చి ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి డాక్టర్ నిమ్మల ట్రాక్టర్‌ను నడిపి రైతులకు సంఘీభావం తెలిపారు.