Share News

ఉద్యోగ భద్రత కల్పించాలని..

ABN , Publish Date - Apr 29 , 2025 | 12:27 AM

ఉద్యోగు ల ఉద్యోగ భద్రతకు సంబంధించి సర్క్యులర్‌ 1/2019ను వెంటనే అమలు చేయాలని ఎన్‌ఎంయూ డిపో సెక్రటరీ కేబీ రాజు డిమాండ్‌ చేశారు.

ఉద్యోగ భద్రత కల్పించాలని..

  • సమస్యల పరిష్కారం కోరుతూ ఎన్‌ఎంయూ సభ్యుల రిలే దీక్ష

  • సీహెచ్‌వోల నిరసన

పార్వతీపురంటౌన్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగు ల ఉద్యోగ భద్రతకు సంబంధించి సర్క్యులర్‌ 1/2019ను వెంటనే అమలు చేయాలని ఎన్‌ఎంయూ డిపో సెక్రటరీ కేబీ రాజు డిమాండ్‌ చేశారు. సోమవారం ఏపీఎస్‌ ఆర్టీసీ లో ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక డిపో వద్ద రెండు రోజుల రిలే దీక్ష చేపట్టారు. సంఘ నాయకులు పాల్గొన్నారు.

పాలకొండ: పాలకొండ డిపో దగ్గర నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యం లో రిలే దీక్షా కార్యక్రమం సోమవారం నిర్వ హించారు. ముఖ్య అతిథిగా విశాఖ జిల్లా మాజీ కార్యదర్శి బి.నీలకం ఠం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి వావిలపల్లి రాజేష్‌, నాయకలు పాల్గొన్నారు.

బెలగాం: కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్ల(సీహెచ్‌వో)ను క్రమబద్ధీకరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బీవీ రమణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. సీహెచ్‌వోల నాయకుడు జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 12:27 AM