పండగలోపు పనులు పూర్తి కావాల్సిందే..
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:29 AM
సాలూరు గ్రామ దేవత శ్యామలాంబ అమ్మవారి పండగలోగా అభివృద్ధి పనులు పూర్తి కావాల్సిందేనని మున్సిపల్ చైర్మన్ పువ్వల ఈశ్వరమ్మ అధికారులను ఆదేశించారు.

మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో అధికారులను కోరిన కౌన్సిలర్లు
సాలూరు, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): సాలూరు గ్రామ దేవత శ్యామలాంబ అమ్మవారి పండగలోగా అభివృద్ధి పనులు పూర్తి కావాల్సిందేనని మున్సిపల్ చైర్మన్ పువ్వల ఈశ్వరమ్మ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థాని క మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మున్సిపల్ సిబ్బంది ఎజెండాలోని అంశా లను చదివి వినిపించారు. ప్రభుత్వం రెండు కోట్ల రూపా యలను రీయంబర్స్‌మెంట్ పద్ధతిపై విడుదల చేసిన గ్రాంటుకు సంబంధించి 81 అభివృద్ధి పనులను చేయుట కు కౌన్సిల్ తీర్మానం చేసింది. అయితే రక్షిత తాగునీటి పథకాలు, విద్యుత్, పారిశుధ్యం, సాముహిక మరుగుదొ డ్లు, పార్కుల అభివృద్ధి మొత్తంగా ఈ పనులన్నింటినీ మేనెలలో నిర్వహించనున్న గ్రామదేవత పండుగలోగా పూర్తి చేయాలని పాలక వర్గం కోరింది. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. పండగ సందర్భంగా సాలూరు ఏరియా ఆసుపత్రి విభాగంలో స్పెషల్ శానిటేషన్ చేసేందుకు పది రోజులకు రూ.4లక్షలు ఖర్చు అవుతుందని ఆ డబ్బులను మున్సిపల్ సాధారణ నిధుల నుంచి ఖర్చు చేసేందుకు అనుమతి ఇవ్వాలని మున్సిపల్ అధికారులు తీర్మానం ద్వారా కోరా రు. అందుకు పాలకవర్గం ఆమోదం తెలిపింది. పండగ నేపథ్యంలో మొబైల్ టాయిలెట్స్ నిర్మాణం కోసం సుమా రు రూ.5 లక్షల వ్యయం అవుతుందని, వాటిని సాధారణ నిధుల నుంచి ఖర్చు చేసేందుకు కౌన్సిల్ ఆమోదం కోసం తీర్మాణం కోరగా ఆమోదం తెలిపారు. డస్ట్‌బిన్లతో పాటు ఒక సంవత్సర కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేసేందుకు డ్రైవర్లు, క్లీనర్లను నియమించి రూ.17లక్షల 60వేల సాధారణ నిధుల నుంచి వారికి చెల్లించు టకు కౌన్సిల్ ఆమోదం కోసం పెట్టగా ఆమోదం తెలిపారు. మూలకు చేరిన కాంపాక్టర్, ట్రాక్టర్లు, పుస్‌కార్డులు, పలు యంత్రాలను రిపేరు చేసేందుకు రూ.12లక్షల 90వేలతో ఆమోదం తెలిపారు. తమ వార్డులో దోమలను నియంత్రిం చడం లేదని 26వ వార్డు కౌన్సిలర్ సన్యాసమ్మ ప్రశ్నించారు. సర్వసభ్య సమావేశంలో మున్సిపల్ కమిషనర్ డీటీ వి.కృష్ణారావు తో పాటు పలువురు అధికారులు, కౌన్సిలర్ పాల్గొన్నారు.