మహనీయుడు బళ్లారి రాఘవ
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:25 AM
తెలుగు రంగానికి విశేష సేవలు అందించి. నాటక రచనలతో సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన మహనీయుడు బళ్లారి రాఘవ అని జిల్లా అదనపు ఎస్పీ సౌమ్యలత అన్నారు.

విజయనగరం క్రైం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): తెలుగు రంగానికి విశేష సేవలు అందించి. నాటక రచనలతో సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన మహనీయుడు బళ్లారి రాఘవ అని జిల్లా అదనపు ఎస్పీ సౌమ్యలత అన్నారు. శనివారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో బళ్లారి రాఘవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ బళ్లారి ఉపాధ్యా యుడిగా, న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, రాజకీయ నాయకుడిగా, విభిన్న రంగాల్లో తమ ప్రతిభ ను చాటుకున్నారన్నారు. బ్రిటీష్ ప్రభుత్వం బళ్లారి రాఘవకు రావు బహుదూర్ బిరుదును ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సుధాకర్, ఏవో శ్రీనివాసరావు, రామకృష్ణ, వెంకటలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.
విజయనగరం రింగురోడ్డు: నాటకరంగానికి పితామ హుడుగా బళ్లారి రాఘవ పేరు గాంచారని విజయ నగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. బళ్లారి రాఘవ జయంతి సందర్భంగా విజ యనగరరలో శనివారం ఆయన చిత్రపటానికి పూల మాల వేసి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, టీపీఆర్వో సింహాచలం, మున్సిపల్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్శింగరాజు, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.