రైతన్నలకు అండగా..
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:23 AM
రైతన్నలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుం దని ఎమ్మెల్యేలు అన్నారు.

రైతన్నలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుం దని ఎమ్మెల్యేలు అన్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకంలో భాగంగా శనివారం రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేశారు. ఈసందర్భంగా జిల్లా లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొని, చెక్కులను పంపిణీ చేశారు.
హామీల అమలుకు సీఎం కృషి
రాజాం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): సూపర్‌సిక్స్ హామీ లను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబునాయుడు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. శనివారం స్థానిక ఎస్‌ఆర్ కన్వెన్షన్‌లో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని, ప్రసం గించారు. మొదటి విడతలో భాగంగా రూ.7వేలు చొప్పు న ఒక్క రాజాం నియోజకవర్గంలో రైతుల ఖాతాల్లో రూ.26.8 కోట్లు జమయ్యాయన్నారు. ఏడీ కె.చంద్రరావు, ఏవో చీకటి రఘునాథ్, బొత్స వాసుదేవరావునాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి ధాన్యంతో అభిషేకం చేశారు.
సూపర్‌సిక్స్ అమలు చేస్తున్నారు
చీపురుపల్లి (గరివిడి): సూపర్‌సిక్స్ పథకాలను ము ఖ్యమంత్రి నారా చంద్రబా బునాయుడు అమలు చేస్తు న్నారని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు. చీపురుపల్లి మండలం పీకే పాలవలస గ్రామంలో శనివారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చీపురుపల్లి నియోజకవ ర్గంలో మొదటి విడతలో 36,916 మంది రైతుల ఖాతాల్లో రూ.24కోట్ల 32లక్షల పెట్టుబడి సాయాన్ని జమ చేశార ని తెలిపారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఎస్.కోటకు రూ.27కోట్ల 53లక్షలు
లక్కవరపుకోట: చంద్రబాబు ప్రభుత్వం రైతులకు అండగా ఉందనడానికి అన్నదాత సుఖీభవ పథకమే నిదర్శనమని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. మండల కేంద్రంలో ఏవో హరికృష్ణ ఆధ్వర్యం లో శనివారం ఆమె అన్నదాత సుఖీ భవ-పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మా ట్లాడుతూ నియోజకవర్గంలో 41వేల మంది రైతులకు రూ.27కోట్ల 53లక్షల 40వేలు జమ అయ్యాయని చెప్పారు. ఇప్పటి వరకు వెబ్‌ల్యాండ్ డాటా ప్రకారం పేర్లు వచ్చాయని, సుమారు 2వేల మంది వివిధ కార ణాలతో పెండింగ్ ఉందని ఏడీఏ భానులత తెలిపారు. రాష్ట్ర టూరిజం డైరెక్టర్ సుధారాణి, ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల మల్లునాయుడు, మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు, సర్పంచ్ పార్వతి తదితరులు పాల్గొన్నారు.