Share News

వేతన బకాయిలు ఇవ్వాలి

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:12 AM

ఉపాధ్యాయులకు వెంటనే పొజిషిన్‌ ఐడీ ఇచ్చి బకాయి వేతనాలు చెల్లించాలని ఫ్యాప్టో రాష్ట్ర అధ్యక్షుడు గణపతి రావు డిమాండ్‌చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముం దు ఎన్నికల్లో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, బోధనేతర కార్యక్రమం నుంచి విముక్తి కల్పించాలని కోరారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో శని వారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు.

 వేతన బకాయిలు ఇవ్వాలి
నిరాహార దీక్ష చేస్తున్న ఉపాధ్యాయులు

బెలగాం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) :ఉపాధ్యాయులకు వెంటనే పొజిషిన్‌ ఐడీ ఇచ్చి బకాయి వేతనాలు చెల్లించాలని ఫ్యాప్టో రాష్ట్ర అధ్యక్షుడు గణపతి రావు డిమాండ్‌చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముం దు ఎన్నికల్లో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, బోధనేతర కార్యక్రమం నుంచి విముక్తి కల్పించాలని కోరారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో శని వారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా గణపతి రావు మాట్లాడుతూ ఉపాధ్యాయులను బదిలీ చేసినా జీతాలు మాత్రం ఇం తవరకు చెల్లించలేదని, జీతంమీదే ఆధారపడి జీవనం సాగిస్తున్న ఉపాధ్యా యులు మూడునెలలుగా ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారని పేర్కొన్నారు. ఐడీ నెంబర్‌ లేకపోవడంతో జీతాలు ఆలస్యం అవుతున్నాయని విద్యాశాఖ మంత్రి అనడం అన్యాయమని, బదిలీ చేసిన వెంటనే ఐడీ నెంబర్‌ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. యాప్‌ల బాధ్యతలు వంటి బోధనేతర కార్యక్రమాల నుంచి విముక్తి కలిగించి బోధనపైనే తమ బాధ్యతలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేయాలని, ఐఆర్‌ ఇవ్వాలని, సరెండర్‌ లీవ్‌ల బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పలు ఉపాధ్యాయ సంఘాల నాయకలు ఎస్‌.మురళీమోహన్‌, మహేష్‌, భాస్కరరావు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 12:12 AM