Share News

ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: ఎస్పీ

ABN , Publish Date - Apr 29 , 2025 | 12:28 AM

ఫిర్యాదుల పరి ష్కారంలో అలసత్వం లేకుండా త్వరితగతిన పరిష్కరిం చాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు.

 ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: ఎస్పీ

బెలగాం, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఫిర్యాదుల పరి ష్కారంలో అలసత్వం లేకుండా త్వరితగతిన పరిష్కరిం చాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. సోమవా రం స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యం లో పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. మొత్తం 10 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. త్వరితగతిన ఫిర్యాదులు పరి ష్కరించి బాధితులకు భరోసా కల్పించాలని అధికారులను ఆదేశించారు. డీసీఆర్‌బీ సీఐ ఆదాం, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా గ్రీవెన్‌లో.

పార్వతీపురం, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): స్థానిక కలెక్ట రేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో పలువు రు వినతిపత్రాలు సమర్పించారు. బాలగుడబ గ్రామం లోని లంకెల చెరువు ఆక్రమణదారులపై చర్యలు చేప ట్టాలని సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు పి.అప్పారావు వినతిపత్రం అందజేశారు. కురుపాం మండలం లండగొల్లిగూడ గ్రామంలో మినీ అంగన్‌వాడీ కేంద్రం మంజూరు చేయాలని ఇందిరమ్మ వినతిపత్రం అందించారు. గుమ్మలక్ష్మీపురం మండలం వనకాబడి, వండిడి గ్రామాలకు ఆశ వర్కర్‌ పోస్టును భర్తీ చేయాలని కోరుతూ కె.రవి వినతిపత్రం అందజేశారు.

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 33 వినతులు

సీతంపేట రూరల్‌,ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి):స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరష్కార వేదికకు 33 వినతులు వచ్చాయి. వితంతు పింఛన్‌ ఇప్పించాలని మెలియాపుట్టి మండలం గొడ్డ గ్రామానికి చెందిన పెద్దింటి పోలమ్మ కోరింది. ఎగువ దొండమానుగూడ గ్రామంలో తాగునీటి బోరు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు పీవోను కోరారు. చాపరాయిగూడ గ్రామంలో సీసీ రహదారి నిర్మించాలని ఆరిక ఎల్లారు కోరగా ఎగువసంకిలి గ్రామంలో వరదగోడ నిర్మించాలని సవర నరేష్‌ కోరారు. ఇలా అనేక సమస్యలు పరిష్కారం కోరుతూ గిరిజనులు పీజీఆర్‌ఎస్‌లో వినతులు సమర్పించారు. పీజీఆర్‌ఎస్‌లో పీవోతో పాటు ఏపీవో జి.చిన్నబాబు, డీడీ అన్నదొర, టీడబ్ల్యూ ఈఈ రమాదేవి, ఏఎంవో కోటిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 12:28 AM