Share News

good days for Gandhi Park గాంధీ పార్కునకు మహర్దశ

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:29 AM

good days for Gandhi Park ’అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకిచ్చిన మరో హామీ అమలుకు నోచుకుంది. విజయనగరంలోని గాంధీపార్కు అభివృద్ధికి రూ.35లక్షల85వేలను విశాఖ మెట్రో పాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) కేటాయించింది.

good days for Gandhi Park గాంధీ పార్కునకు మహర్దశ
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, అధికారులు

గాంధీ పార్కునకు మహర్దశ

రూ.35లక్షల85వేలను కేటాయించిన వీఎంఆర్‌డీఏ

’అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి స్పందన

పీఎస్సార్‌ పార్కు, జేఎన్‌టీయూ రహదారి అభివృద్ధి పనులకూ శంకుస్థాపన

రూ.8 కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు

విజయనగరం/విజయనగరం రూరల్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ’అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకిచ్చిన మరో హామీ అమలుకు నోచుకుంది. విజయనగరంలోని గాంధీపార్కు అభివృద్ధికి రూ.35లక్షల85వేలను విశాఖ మెట్రో పాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) కేటాయించింది. ఈ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. దీంతో పాటు పీఎస్‌ఆర్‌ పార్కునకు రూ.44లక్షలు, జేఎన్‌టీయూ కళాశాల రోడ్డు అభివృద్ధికి రూ.7 కోట్ల 12 లక్షలు కేటాయించారు. ఈ పనులకు కూడా వారు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రణవ్‌గోపాల్‌ మాట్లాడుతూ, వీఎంఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టను న్నట్టు చెప్పారు. విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి రూ.8 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని, ప్రజలకు అవసరమైన పనులకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. విజయ నగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రజావసరాలను గుర్తించి వాటిని అభివృద్ధిచేయడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌, కాపు కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పాలవలస యశస్విని, 43వ డివిజన్‌ కార్పొరేటర్‌ దాసరి సత్యవతి, ఏఎంసీ చైర్మన్‌ కర్రోతు నర్సింగరావు, వైస్‌ చైర్మన్‌ చంద్రినాయడు, విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్‌ నల్లనయ్య, టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, ప్రసాదుల ప్రసాద్‌, ఆల్తి బంగారుబాబు, గంటా రవి, బెవర భరత్‌తో పాటు లంకవీధి, రాజీవ్‌నగర్‌ కాలనీలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 12:29 AM