ఈ-వ్యర్థం.. ఇచ్చేద్దాం
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:01 AM
ఎలకా్ట్రనిక్ వస్తువుల వినియోగం గణనీ యంగా పెరిగిపోతోంది. దీంతో తయారీదారులు ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లలో ఎలకా్ట్రనిక్, ఎలక్ట్రికల్ వస్తువుల్ని మార్కెట్లోకి డంప్ చేస్తు న్నారు.

రాజాం రూరల్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి)
ఎలకా్ట్రనిక్ వస్తువుల వినియోగం గణనీయంగా పెరిగిపోతోంది. దీంతో తయారీదారులు ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లలో ఎలకా్ట్రనిక్, ఎలక్ట్రికల్ వస్తువుల్ని మార్కెట్లోకి డంప్ చేస్తు న్నారు. వినియోగదారులు కూడా పాత వస్తు వులకు మంగళం పాడుతూ కొత్త వస్తువులు కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో వ్యర్థాల నిల్వలు కూడా విపరీతంగా పెరిగిపో తున్నాయి. వీటివల్ల మానవాళికి ముప్పుతో పాటు పర్యావరణానికి హాని కలిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఒన్స్ యూజ్‌డ్ ప్లాస్టిక్ వ్యర్థాలను, పాలిథిన్ కవర్లను నిషేధించడంతో పాటు ఈ వ్యర్థాల ఏరివేతకు ప్రభుత్వం నడుం బిగించింది. తొలిదశలో మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో వీటి ఏరివేత దిశగా అధికా రులు అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి ప్రతి మూడో శనివారం అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఇందుకు ఉపయో గించుకుంటోంది. జిల్లా కేంద్రంతో పాటు రాజాం, బొబ్బిలి మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీలో ఈ వ్యర్థాల ఏరివేత కార్యక్రమం ప్రారంభించారు. వీధుల్లోకి వచ్చే పారిశుధ్య కార్మికులకు ఇళ్లల్లో ఉన్న ఈ వ్యర్థాలను అందజేయాలని కలెక్టర్ అంబేడ్కర్ జిల్లా ప్రజలకు ఇప్పటికే సూచించారు.
ఈ-వ్యర్థాలంటే..
పాడైన టీవీలు, టీవీల్లోని మదర్ బోర్డులు, పనిచేయని డెస్క్‌టాప్ కంప్యూటర్లు, వాటిలోని పరికరాలు, కీ బోర్డులు, మౌస్‌లు, మానిటర్లు, ఫోన్లు, సెల్‌ఫోన్లు, పాత కాలం రేడియోలు, టేప్ రికార్డర్లు, ఏసీలు, కూలర్లు, వాటిలోని విడి పరికరాలను ఈ-వేస్ట్ అంటారు. వీటివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయినా మనకు తెలియకుండానే ఆఫీసులు, ఇళ్లల్లో ఉంచివేడయంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది.
వీటినేం చేస్తారంటే..
సేకరించిన ఈ వ్యర్థాలను ఇప్పటికే ఏర్పాటు చేసిన సెంటర్లలో పొందుపరిచి వాటినుంచి పాణాంతక రసాయనాలు, ఖనిజాలను వేరుచే స్తారు. విలువైన లోహాలను వేరుచేసి అవసర మైన వాటిని ఉత్పాదక పునర్వినియోగం, పునరుత్పాదక రంగాలకు తరలిస్తారు. ఈ-వ్య ర్థాల సేకరణలో మున్సిపాలిటీలలో కమిషనర్లు, శానిటరీ అధికారులు నిమగ్నమయ్యారు. వాటివల్ల కలగనున్న అనర్థాలను వివరిస్తు న్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ-వేస్ట్‌తో అనర్థాలు..
నిరుపయోగ ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్ వస్తువుల వల్ల ప్రజారోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. ఈ-వ్యర్థాలు గాలి, నీరు, నేలను విషతుల్యం చేస్తాయి. ఇళ్లు, షాపులు, గిడ్డంగులు, ఇంటి పరిసరాల్లో ఇవి ఉండడం వల్ల వాంతులు రావ డం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తా యని, కండరాల నొప్పి, డయేరియా, తీవ్ర కాలు ష్యం, ఊపిరితిత్తులపై చెడు ప్రభావం, భూ తాపం పెరగడం, విష వాయువులు విడుదల కావడం, నేలల్లో కలిసి భూసారం క్షీణించడం వంటి అనర్థాలు ఏర్పడతాయి. ప్రజలు స్వచ్ఛందంగానే తమ ఇళ్లల్లో పేరుకుపోయిన ఈ-వేస్ట్‌ను అందజేయాలి.
-డా.గార రవిప్రసాద్, ఎండీ, జనరల్ మెడిసిన్, రాజాం