Share News

రైతుకు అండగా కూటమి ప్రభుత్వం

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:15 AM

ఆర్థిక ఇబ్బందుల్లోనూ రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. శనివారం అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ పథకం చెక్కుల పంపిణీ కార్య క్రమం నిర్వహించారు.

రైతుకు అండగా కూటమి ప్రభుత్వం
సీతానగరం: అన్నదాత సుఖీభవ చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే విజయచంద్ర ::

ఆర్థిక ఇబ్బందుల్లోనూ రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. శనివారం అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ పథకం చెక్కుల పంపిణీ కార్య క్రమం నిర్వహించారు.

ఫసీతానగరం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): రైతు గెలవాలి.. వ్యవసాయం నిలవాలనేది తెలుగుదేశం ప్రభుత్వం నినాదమని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. మండలంలోని గుచ్చిమిలో అన్నదాత సుఖీభవ రైతు సదస్సులో భాగంగా అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ పథకం కింద పార్వతీపురం నియోజకవర్గంలో రైతులకు రూ. 18.06 కోట్లు విడుదల కావడంతో రైతులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చం ద్రబాబు చిత్రపటానికి రైతులతో కలిసి క్షీరాభిషేకం చేశారు కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్‌ శ్రీవాస్తవ, వ్యవసాయాధికారులు అవినాష్‌, అశోక్‌, శ్రావ ణ్‌కుమార్‌, గణేష్‌ పాల్గొన్నారు.

ఫపాలకొండ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. మండలంలోని కొండాపురంలో అన్నదాత సుఖీభవ నిధులు రైతులకు అందించే కార్యక్రమం నిర్వ హించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, కూటమి నాయ కులు కర్నేన అప్పలనాయుడు, గంటా సంతోష్‌కుమార్‌, తేజోవతి, గర్భాన సత్తిబాబు, ఏఎంసీ చైర్మన్‌ సంధ్యారాణి, ఎంపీపీ బొమ్మాళి భానుమతి, కరణం మురళి, లెంక మనోహర్‌నాయుడు, రాయి రామకృష్ణ, జాడ శ్రీధర్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 12:15 AM