Share News

A Life Built on Friendship స్నేహమేరా జీవితం

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:14 AM

A Life Built on Friendship కష్టనష్టాల్లో కుటుంబ సభ్యులు, బంధువులు ముఖం చాటేస్తున్న తరుణంలో ‘మేమున్నామంటూ’ అండగా నిలుస్తున్నారు ఈ స్నేహితులు. తమ మిత్రులను ఆదుకోవాలనే లక్ష్యంతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. అంతటితోనే సరిపెట్టుకోకుండా ఇలా రీయూనియన్‌ అయిన స్నేహితులు తాము చదివిన విద్యాసంస్థలకు, సమాజానికి ఎంతోకొంత సాయపడుతున్నారు.

A Life Built on Friendship  స్నేహమేరా జీవితం

  • నేడు స్నేహ దినోత్సవం

సాలూరు రూరల్‌, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): కష్టనష్టాల్లో కుటుంబ సభ్యులు, బంధువులు ముఖం చాటేస్తున్న తరుణంలో ‘మేమున్నామంటూ’ అండగా నిలుస్తున్నారు ఈ స్నేహితులు. తమ మిత్రులను ఆదుకోవాలనే లక్ష్యంతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. అంతటితోనే సరిపెట్టుకోకుండా ఇలా రీయూనియన్‌ అయిన స్నేహితులు తాము చదివిన విద్యాసంస్థలకు, సమాజానికి ఎంతోకొంత సాయపడుతున్నారు. సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1985-86లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు గతేడాది స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో రీయూనియన్‌ అయ్యారు. కరోనాలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. తమ స్నేహితుల్లో ముగ్గురికి ఆర్థిక సాయమందించారు. మరో స్నేహితుడు విధులు నిర్వహించడానికి వీలుగా బైక్‌ను సైతం అందించారు. అదే పాఠశాలలో 1980లో పదో తరగతి చదివిన స్నేహితులంతా అప్పుడప్పుడూ రీ యూనియన్‌ అవుతున్నారు. కెనడాతో పాటు దేశంలో పలు రాష్ర్టాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులంతా గతేడాది సాలూరు జూనియర్‌ కళాశాలలో కలుసుకున్నారు. మహిళలు 35 మంది, 115 మంది పురుషులు కుటుంబాలతో హాజరై సందడి చేశారు. స్నేహితుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారు చదువుకున్న పాఠశాలకు వేలాది రూపాయల సౌండ్‌ సిస్టం అందించారు. మరో పాఠశాలకు ఇన్వర్టర్‌ను అందించారు. తమ స్నేహితుల్లో ముగ్గురికి ఆర్థిక సాయం చేశారు. ఇలా వారు తమ మైత్రీని కొనసాగిస్తూ సామాజిక సేవలందిస్తున్నారు.

Updated Date - Aug 03 , 2025 | 12:14 AM