Share News

Breaking News: వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్..

ABN , Publish Date - Mar 05 , 2025 | 07:57 PM

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. కీలక సాక్షి రంగయ్య(70) మృతి చెందారు.

Breaking News: వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్..

కడప: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కీలక సాక్షి రంగయ్య(70) మృతి చెందారు. వివేకా నివాసంలో వాచ్‌మెన్‌గా పనిచేసిన రంగయ్య పలు ఆరోగ్య సమస్యల కారణంగా కడప రిమ్స్‌లో చికిత్సపొందుతూ కన్నుమూశారు.


2019 మార్చి 15న మాజీ మంత్రి వివేకానందరెడ్డి అతి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. హత్య జరిగిన రోజు వివేకా ఇంట్లోనే రంగయ్య ఉండటంతో సీబీఐకి ఆయన వాంగ్మూలం ఇస్తూ కీలక అంశాలు బయటపెట్టారు. ఇలా వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగయ్యకు గతంలో సీబీఐ గన్‌మెన్లను కూడా కేటాయించింది. కాగా, వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రంగయ్య.. నేడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కడప రిమ్స్‌కు తరలించారు. ఈ క్రమంలోనే చికిత్సపొందుతూ మృతి చెందారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Chandrababu: ప్రజలు మావైపే ఉన్నారనేందుకు ఇదే నిదర్శనం

Nadendla Manohar: ఫస్ట్ ఇది నేర్చుకో.. జగన్‌కు నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్ కౌంటర్..

Updated Date - Mar 05 , 2025 | 09:36 PM