Share News

గంజాయి కేసులో ముగ్గురికి పదేళ్ల జైలు, జరిమానా

ABN , Publish Date - Apr 29 , 2025 | 01:31 AM

గంజాయి రవాణా కేసులో నేరం రుజువుకావడంతో ముగ్గురికి పదేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ స్థానిక 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి కె.రత్నకుమార్‌ సోమవారం తీర్పు ఇచ్చారు.

గంజాయి కేసులో ముగ్గురికి పదేళ్ల జైలు, జరిమానా

చోడవరం, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి):

గంజాయి రవాణా కేసులో నేరం రుజువుకావడంతో ముగ్గురికి పదేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ స్థానిక 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి కె.రత్నకుమార్‌ సోమవారం తీర్పు ఇచ్చారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా వున్నాయి. చీడికాడ మండలం బైలపూడికి చెందిన జాజిమొగ్గల సంతోశ్‌, గెంజి మరిడిబాబు, జాజిమొగ్గల దేముడు 2015లో వంద కిలోల గంజాయిని రవాణా చేస్తుండగా అప్పటి చీడికాడ ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు వారిని పట్టుకుని గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు సమగ్రంగా సాక్ష్యాలు కోర్టు ముందు ఉంచగా, ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ ఉగ్గిన వెంకటరావు నేరాన్ని రుజువుచేయడంతో నిందితులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. లక్ష రూపాయలు జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు సాధారణ జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.

Updated Date - Apr 29 , 2025 | 01:31 AM