Share News

సీలేరులో రాష్ట్ర స్థాయి కబడ్డీ, టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీలు

ABN , Publish Date - Aug 02 , 2025 | 11:31 PM

జీకేవీధి మండలం సీలేరులో ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్ట్ర స్థాయి ఇంటర్‌ సర్కిల్‌ కబడ్డీ, టగ్‌ ఆఫ్‌ వార్‌ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్టు స్థానిక జెన్‌కో స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ జనరల్‌ సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు.

సీలేరులో రాష్ట్ర స్థాయి కబడ్డీ, టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీలు

5 నుంచి జెన్‌కో ఆధ్వర్యంలో నిర్వహణ

రెండు పోటీల్లో పాల్గొనున్న 30 జట్లు

సీలేరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం సీలేరులో ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్ట్ర స్థాయి ఇంటర్‌ సర్కిల్‌ కబడ్డీ, టగ్‌ ఆఫ్‌ వార్‌ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్టు స్థానిక జెన్‌కో స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ జనరల్‌ సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ పోటీల్లో ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు ఫ్లడ్‌లైట్ల కాంతుల్లో నిర్వహించనున్నామన్నారు. ఈ పోటీల్లో 20 కబడ్డీ జట్లు, టగ్‌ ఆఫ్‌ వార్‌లో 10 జట్లు పాల్గొంటాయన్నారు. క్రీడాకారులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. క్రీడల నిర్వహణపై స్థానిక జెన్‌కో ఎస్‌ఈ కార్యాలయంలో స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ చైర్మన్‌, ఎస్‌ఈ చంద్రశేఖర్‌తో చర్చించామని శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - Aug 02 , 2025 | 11:31 PM